strange creature………………………….
ఆ జీవికి ఆకలి వేస్తే… దాని శరీరాన్ని అదే తినేస్తుంది. అలాంటి కొన్ని జీవులు సముద్రంలో జీవిస్తున్నాయి. తొమ్మిది మెదళ్లు ఉన్న ఈ వింత జీవి పేరు ఆక్టోపస్.ఈ ఆక్టోపస్ కు ఒకటి కాదు మూడు గుండెలు ఉన్నాయి. ఆక్టోపస్ కు ఉన్న మూడు హృదయాలలో రెండు శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. మూడవ గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని అందించడానికి పని చేస్తుంది.
ఆక్టోపస్ రక్తం రంగు నీలం. ఆక్టోపస్ ని ఇండియాలో ‘అష్టబాహు’ అని కూడా పిలుస్తారు. ఈ జీవికి మొత్తం 8 చేతులు ఉన్నాయి. లైవ్ సైన్స్ వెబ్సైట్ నివేదిక ప్రకారం ఆక్టోపస్ ఆకలితో ఉన్నప్పుడు, అది తన చేతులను కొరికి వాటిని తింటుంది. ప్రపంచంలో సుమారు 300 జాతుల ఆక్టోపస్ లు ఉన్నాయి.
వాటిలో కొన్ని చాలా విషపూరితమైనవి. ఇవన్నీ సముద్ర జలాల్లో జీవిస్తుంటాయి. ఈ విషపూరిత ఆక్టోపస్ కరిస్తే మనిషి జీవించడం కష్టం. అందుకే కొందరు దీనిని ‘సముద్ర రాక్షసి’ అని కూడా పిలుస్తారు.. వీటి సైజులు కూడా భిన్నంగా ఉంటాయి. వీటిలో కొన్ని 12 అడుగుల పొడవు నుంచి 36 ఇంచుల వెడల్పులో ఉంటాయి. 3 నుంచి 10 కిలోల బరువు ను కలిగి ఉంటాయి. మరి కొన్ని మరి పెద్ద సైజులో కూడా ఉంటాయి.
మిగతా జీవుల్లో మాదిరిగా వీటిలో పునరుత్పత్తి జరుగుతుంది. పునరుత్పత్తి ప్రక్రియ లో భాగం గా ఆడ ఆక్టోపస్ తో కలసిన తర్వాత మగ ఆక్టోపస్ కొన్ని రోజుల పిదప చనిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ జీవులు చేపలు, పీతలను ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ ఆక్టోపస్‌లు తక్కువ జీవిత కాలం కలిగి ఉంటాయి; కొన్ని జాతులు ఆరు నెలల వరకు మాత్రమే జీవిస్తాయి.
జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్ జాతి ఆక్టోపస్ జాతులలో ఒకటి ఐదు సంవత్సరాల వరకు జీవించే అవకాశాలున్నాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ ఆహరం తగ్గిస్తాయి. క్రమంగా బలహీన పడతాయి. ఈ దశలో గాయాలు ఏర్పడుతుంటాయి. తమను తాము రక్షించుకోలేక, ఆక్టోపస్‌లు తరచుగా మాంసాహారుల బారిన పడతాయి.వీటిలో చాలా జాతులున్నాయి. ఇప్పటికి వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి.