పద్యాలకూ.. ప్రాణం పోసిన గానలోలుడు !
Bharadwaja Rangavajhala …………………………. మారు పేరు ఘంటసాల…అసలు పేరు గానలోల… అంటారు బాపూ రమణలు. తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల.పద్యం అంటే ఘంటసాల. ఘంటసాల అంటే పద్యం అంతగా పద్యంతో పెనవేసుకుపోయింది ఆపేరు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే… కసరత్తు తప్పదు మరి. ఒక్కోసారి సాహిత్యాన్నికొంత భాగం మింగేసేలా రాగాలు సాగేవి. ఈ పద్దతిని …