డప్పుని గిటార్లు కలిశాయి!!
Mohan Artist ……………………………………………….. కోరి కష్టాలు కొని తెచ్చుకోవడమంటే ఇదే. లక్షణంగా బి.టెక్. పాసై సుఖంగా ఇంజనీరు ఉద్యోగం చేస్తూ పెళ్ళాం బిడ్డల్ని చూసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేస్తే ఎంత బావుంటుంది. నలుగురూ మెచ్చు కుంటారు. పరువూ మర్యాదా ఉంటాయి. కానీ ఇవన్నీ చెయ్యలేనని లెల్లే సురేష్ బి.టెక్. డిగ్రీ ట్రంకు పెట్టెలో అడుగున పారేశాడు. …