పెంకుటిల్లుకూ…ఓ కథ వుంది..!!
Abdul Rajahussain…………….. ఉమ్మడి కుటుంబాల ‘ వసారా ‘ కూలిపోతోంది..మనుషుల్ని కలిపివుంచే మండువా లోగిళ్ళు మాయమైపోతున్నాయి….!! సాంప్రదాయపు ‘ పెంకులు ‘ ఊడిపోతున్నాయి ..!!ఒకప్పుడు పల్లెల్లో పూరిళ్ళు, పెంకుటిళ్ళుండేవి . ఎక్కడోగానీ…మేడనో, మిద్దెనో, డాబానో కనబడేది. పేదోళ్ళు పూరిళ్ళలో వుంటే….ఎగువ మధ్యతరగతి నుంచి ఓ మోస్తరు సంపన్నులు పెంకుటిళ్ళలో వుండే వారు.మోతుబరులు మేడల్లో వుండేవాళ్ళు.అన్ని ఊర్లలో …
