ఎన్టీఆర్ గురించి విన్నది వేరే .. చూసింది వేరే ! (2)
Article by artist Mohan …………………………………………………….. తెల్లారింది. పేపర్లొచ్చాయి. ఆయన బేనర్లు చూసి పక్కనపెట్టాడు. (ముఖ్యమంత్రి కాకముందు ఆమాత్రం కూడా చూసేవాడుగాదని అందరూ చెప్తారు.)”అసలు పనికొద్దాం. ఈనాడు, ఇతర పేపర్లకి పార్టీ ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా! కదలిరా’ అనేది శీర్షిక. పక్కన నేను చేయి ముందుకు చాపి ఉన్న బొమ్మ తెలుసుగదా అది …