ఆకట్టుకునే మాయ!!
పూదోట శౌరీలమ్మ……………………………. యవ్వనంలో అనేక ఒత్తిడులకు లోనై వివాహానికి నోచుకోక మనుషులకు దూరంగా .. ఒంటరి జీవితం గడుపుతున్న అందమైన మాయాదేవి,ఒక పెద్ద పురాతనమైన మహల్ లో వుంటుంది. తోడుగా రెండు పెద్ద భయంకరమైన కుక్కల్ని, పక్షుల్ని పెంచుకుంటూ వుంటుంది. ఎప్పుడూ నల్లని బట్టలు ధరిస్తూ …ప్రపంచం పట్ల ఏహ్య భావం,మనుషుల పట్ల అపనమ్మకం కలిగి …