ఏడు చేపల కథ .. రివర్స్..!!

Sharing is Caring...

Neil Kolikapudi …..………………………….. 

అనగనగా ఓ రాణి.. ఆ రాణికి ఏడుగుగురు కుమార్తెలు..ఏడుగురు తోటకెళ్లి ఏడు పచ్చిమామిడికాయలు తెచ్చారు..వాటిని చెలికత్తెలు ఓ చీకటి గదిలో.. ఏడు బుట్టల్లో గడ్డేసి పెడతారు..మూడురోజుల తర్వాత చూస్తే..అందులో ఒక కాయ పండ లేదు..’మామిడికాయ..మామిడి కాయ ఎందుకు పండలేదని’ అడుగుతారు..

‘పైనున్న కిటికీలో నుంచి ఎండొచ్చి నా మీద పడింది..అందుకే పండలేదు అంటుంది..’కిటికీ కిటికీ నువ్వెందుకు తెరుచుకున్నావ్..మేము అన్ని మూసివెళ్లాం కదా’ అని అడుగుతారు..’ నేను తెరుచుకోలేదు తోటరాముడొచ్చి తెరిచి వెళ్ళాడు. ‘ అంటుంది..

వాళ్ళు షాకయ్యి ఆ విషయం భటులకు చెప్పారు..భటులు సేనాపతికి చెప్పారు..సేనాపతి మహామంత్రికి చెప్పారు..మహామంత్రి మహారాణి కి  చెప్పటంతో అర్జంటుగా సభ ఏర్పాటు చేస్తుంది..’వెంటనే తోటరాముణ్ణి ప్రవేశపెట్టండని ఆజ్ఞాపిస్తుంది..తోటరాముణ్ణి  గొలుసులతో బంధించి తెస్తారు..’

”నీకెంత ధైర్యంరా .. కోటలో ప్రవేశించి గది కిటికీయే తీసి వెళ్తావా ..వెంటనే ఇతని తల నరికి కోట గుమ్మానికి వేలాడ దీయండి” అంటాడు..మహామంత్రి కోపంతో ఊగిపోతూ..(అతని కోపానికి కారణం అతని కొడుకుని చిన్న రాకుమారికి ఇచ్చి చేయాలని చాలానే కుట్ర చేశారు..దానికి మహారాణి కూడా ఒప్పేసుకుంది..పాపం అతని  కుట్ర తెలియక ఇప్పుడీ తోటరాముడి పని చిరాకు పుట్టిస్తుంది)

‘మహామంత్రి … అతన్ని అని ఏమిలాభం? లోపం,తప్పు మీది..  మీపాలన లోపం,రక్షణ లోపం..’అంటుంది. మంత్రి తలదించుకుంటారు..’చెప్పు ఎందుకు చేశావ్ ఈపని? కిటికీ తలుపు ఎందుకు తీశావ్’అంటుంది.‘నిజం చెప్పమంటారా?అబద్ధం చెప్పమంటారా మహారాణి’ అంటాడు తోటరాముడు ..చేతులుకట్టుకుని వినయంగా..
‘ పిచ్చివేషాలు వేయకు …  నువ్వు ఎన్టీఆర్ వి అనుకుంటున్నావా ? అని మహామంత్రి కేకలేస్తాడు.మహారాణి మంత్రిని కోపంగా చూస్తుంది.మంత్రి తలదించుకుంటాడు. ‘నిజమే చెప్పు’ అంటుంది మహారాణి..

“నేను చిన్న రాకుమారిని ప్రేమిస్తున్నాను మహారాణి..కుంతల రాజ్యం ఆచారం ప్రకారం..కన్నెపిల్లలు పచ్చిమామిడికాయలు కోసి మాగేయటం అవి పండితే.. మీరన్న సంబంధం ఖాయం చేయటం..పండకపోతే ఆడపిల్లలు ఎవరిని  ప్రేమిస్తున్నారో తెలుసుకుని వారినిచ్చి పెళ్లిచేయటం ఆనవాయితీగా వస్తోంది కదా మహారాణి..అందుకే ప్రాణానికి తెగించి..కోటలో ప్రవేశించి కిటికీ తలుపు తీసి వెళ్ళాను.”అని చెప్పి..’ వచ్చాను..చెప్పాను..ఇక మీఇష్టం’ అంటూ అతడులో మహేష్ బాబు నాజర్ ముందు మోకాళ్ళ మీద కూర్చుని చెప్పినట్టు చెప్పాడు.

మహారాణి చిన్న కూతురి వైపు చూసి..’మీరు ప్రేమిస్తున్నారా రాకుమారి ‘అని అడుగుతుంది.. రాకుమారి తల దించుకుంటుంది..’భేష్ ధైర్యానికి మెచ్చాను తోటరాముడు.. నీ ప్రేమలోని తెగింపు నచ్చింది..ప్రాణాన్ని సైతం లేక్కచేయకుండా..సాహసం చేసి కిటికీ తలుపు తీసి వెళ్లి నీప్రేమను గెలిపించుకున్నావ్..రాకుమారి… పూల దండ తోటరాముడి మెడలో వేయండి..’ అంటుంది..అదివిషయం..!!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!