Bharadwaja Rangavajhala………………………………………………………..
రావణుడు : భవతీ భిక్షాందేహి
సీత : వచ్చే వచ్చే
రావణుడు: తొందరగా రావమ్మా …
సీత ః బాబూ .. కాస్త గుమ్మం ముందుకు వచ్చి కబళం తీసుకో నాయనా.
రావణుడు ః ఇందాక అక్కడికే వద్దామనుకున్నానమ్మా .. అక్కడ ఐడియా నెట్ వర్కు లేదు … అందుకే ఇక్కడ నిలబడ్డా .. రా తల్లీ.
సీత ః ఓ అదా అవునవును ఆ ఊసే మరచాను .. మా మరిదిగారు ఇందాక బయటకెడుతూ అక్కడ జామర్ పెట్టాడు బాబూ … పర్లేదులే … ఒక్క నిమిషం ముష్టి వేయించుకుపోడానికి నెట్ వర్క్ గొడవ నీకేల నాయనా .
రావణుడు ః సరిగ్గా అదే టైమ్ లో … మా ఆవిడ ఫోను చేస్తే … నా ఫోను కలవకపోతే హే భగవాన్ … ఆ టార్చర్ నేనూహించలేను … నేను ఏ పని చేసినా మా ఆవిడ ఏమీ అనదుగానీ … తను ఫోను చేసినప్పుడు తీయకపోయినా అవుటాఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చినా … నా వల్ల కాదు .
సీత ః అలాగా నాయనా …
రావణుడు ః ఏం చెప్పమంటావులే … తల్లీ … అందుకే కాస్త ఈ జామర్ దాటి వచ్చి ముష్టేసి వెళ్లమ్మా …
సీత ః నువ్వన్నదీ కరెక్టేలే … ఎవరి కష్టాలు వారివి … వస్తున్నా వస్తున్నా … నువ్వన్నట్టు ఆ జామర్ పెట్టినప్పట్నించీ నా ఫోనూ పన్జేసి చావడం లేదు … కాస్తలా బయటకొచ్చి ఒక్కసారి ఫేసుబుక్కులోకి వెళ్తే
రావణుడు ః (మనసులో అనుకున్నాడు …) అంతే నమ్మా నువ్వు ఇవతలకి వచ్చి ఫేసుబుక్కులో ఉండు … నా పని నేను కానిస్తా
సీత ః బాబూ పట్టు …
కబళం వేసేసి ఆ ప్లేటు అక్కడే ఉన్న ఓ నందివర్ధనం చెట్టు మొదల్లో పెట్టి …చెంగున ముడేసుకున్న ఐ సెవెన్ తీసి ఎఫ్ బి ఓపెన్ చేయబోతోంది సీత.
రావణుడు ః అమ్మా … ఇక్కడ కూర్చుని విశ్రాంతిగా ఫేసుబుక్కు చూసుకో తల్లీ ..
కళ్లెత్తి చూసిన సీతమ్మవారికి ఎదురుగా ఎన్నడూ చూడని పొడవాటి గద్దె కనిపించింది… కొన్ని మొక్కలు మధ్యలో అందంగా అమర్చిన కుర్చీలు. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయి వెళ్లి ఓ సీటులో కూర్చుని ఫేసుబుక్కు చూసుకుంటూ ఉండిపోయింది … కాసేపటి తర్వాత దాహం వేసి తలెత్తి చూస్తే తను కూర్చున్న గద్దె చాలా వేగంగా ప్రయాణించడం చూసి హడ్డిలిపోయింది.
సీత ః ఏమిటిది ఏం జరుగుతోంది?
డ్రైవింగు సీటులోంచీ… దీన్ని ట్రాలీ అందురు మాతా దాని మీద వేసిన సెట్టు చూసి మీరు అడవే అని భ్రమించి ఎక్కి కూర్చుని ఫేసుబుక్కులో నిమగ్నమయ్యారు … నేను మిమ్మల్ని కిడ్నాపు చేయుచున్నానని చెప్పుటకు మిక్కిలి సంతసించుచున్నాను ….
అది … చరిత్రలో తొలి కిడ్నాపు జరిగిన తీరన్నమాట … అర్ధమయ్యిందా పిల్లలూ …