Take profits ………………………………..
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా షేర్లు ప్రస్తుతం రూ. 497 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇదే షేర్ ను మే 27 న 418 వద్ద కొనుగోలు చేయమని సిపారసు చేసాం. మార్కెట్ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎపుడైనా మార్కెట్ దిద్దుబాటుకి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో రూ. 400 … అంతకంటే తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఈ షేర్లను అమ్మేసి లాభాలు స్వీకరించడం మంచిది.
మార్చి 2021 తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ రూ. 81,326.96 కోట్ల స్థూల ఆదాయంపై రూ. 6,451 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 80 శాతం పెరిగింది. అనుబంధ సంస్థలతో కలిపి చూసినా ఎస్బీఐ నికర లాభం గత ఏడాది ఇదేకాలంతో పోల్చిచూస్తే 60 శాతం పెరిగి నికరలాభం రూ. 7270. 25 కోట్లకు పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో కూడా పనితీరు మెరుగుపడింది.
2019 -20 ఆర్ధిక సంవత్సరం తో పోలిస్తే నికరలాభం 41 శాతం వృద్ధితో రూ. 14488.11 కోట్ల నుంచి రూ. 20110. 17 కోట్లకు పెరిగింది. అలాగే స్థూల మొండి బకాయిలు రూ.149092 కోట్ల నుంచి 126389 కోట్లకు తగ్గాయి. రుణాల వసూలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ నికర వడ్డీ ఆదాయం పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 27067 కోట్ల వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 18.99 శాతం ఎక్కువ. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఒక్కో షేర్ కి రూ 4 చొప్పున డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.
వార్షిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో అప్పట్లో పెద్ద ర్యాలీ రావచ్చని అంచనా వేశారు.కానీ ర్యాలీ రాలేదు. చాలామంది పాక్షిక లాభాలు స్వీకరించారు. ధరలు గరిష్ట స్థాయికి పెరిగిన క్రమంలో ఇన్వెస్టర్లు మళ్ళీ షేర్లను అమ్ముకునే వ్యూహాన్ని అనుసరిస్తే ఈ షేర్ ధర వేగంగా పతనమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ షేర్లను అమ్మేసి లాభాలు స్వీకరించడం శ్రేయస్కరం. ధర తగ్గినపుడు కావాలంటే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత ధర వద్ద ఈ షేర్లను కొనడం కంటే ధర తగ్గినపుడు మదుపు చేయడం మంచి వ్యూహం.