నిజమండీ ! ఈ మగాళ్లంతా మోస్ట్ …..

Sharing is Caring...

Bharadwaja Rangavajhala……………………………………….. 

Male Domination……………………….

ఈ మేల్ డ్యామినేటెడ్ సొసైటీలో ఫీమేలుగా పుట్ట‌డం క‌న్నా ఏ ఫారెస్టులో అయినా ట్రీగా పుట్టినా మంచిదే అని ఎవ‌డో లిట‌ర‌రీ ప‌ర్స‌న్ అన్న‌ట్టు నా చిన్న‌త‌నంలో విన్నాను.. వాళ్లే మ‌న‌ల్ని డామినేట్ చేసి … మ‌న‌మేదో వాళ్ల‌ని వేదిస్తున్నామ‌ని మ‌న మీద జోకులేస్తూంటారు.. దిసీజ్ రెడిక్యుల‌స్ .. త‌న రెస్పాన్సిబిలిటీ కూడా మ‌న‌మే చెప్పాల్సిన‌ప‌రిస్థితుల్లో … వీళ్ల‌కి ఎందుకండీ పెళ్లిళ్లు.

నిన్న మా ఇంట్లో జ‌రిగిన సీను మీరు వింటే అవాక్క‌వుతారు… ఇదేదో యూట్యూబు టైటిల్ లా ఉంది కదా … నోనోనో డోంట్ లైక్ ద‌ట్ … బ‌ట్ యు మ‌స్ట్ నో వాట్ హాపెన్డ్ ..లిజ‌న్. మా వాడు అదేనండీ మా అబ్బాయి.వాడు ధ‌ర్డ్ క్లాస్ నుంచీ ఫోర్త్ క్లాసుకు ప్ర‌మోట్ అయిన‌ప్ప‌ట్నించీ పేద్ద మ‌గాణ్ణ‌నుకుంటున్నాడు. ప్ర‌తిదానికీ వెధ‌వ రీజ‌నింగూ వాడూ … రీడింగ్ మానేసి ఫోన్ తో సిట్టింగేస్తాడు.

అదేంటంటే..పెద్ద‌గా అరుస్తాడు.నా ఇష్టం. డోంట్ ఇన్ట‌ర్ ఫియ‌ర్ ఇన్ మై డేటూడే అఫైర్స్ అనేశాడు మొన్నైతే. మా అయ‌నే నా ముందు వాల్యూమ్ పెంచ‌డానికి షివ‌ర్ అయిపోతూంటాడు.అలాంటిది వీడు.అస్స‌లు టాల‌రేట్ చేయ‌ లేక‌ పోతున్నాన్నేను. ఇక లాభం లేద‌ని, మొన్నంతా థింక్ చేస్తే … మా అమ్మ‌మ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది .. పిల్ల‌ల పెంప‌కం అనేది ఉమ్మ‌డి బాధ్య‌త అని దాంప‌త్యోప‌నిష‌త్ లో రాసుంద‌ట … అంటే పిల్ల‌ల విష‌యం ఇద్ద‌రూ షేర్ చేసుకోవాల‌ని అన్న‌మాట‌.. వెంట‌నే ఆయ‌న‌కి ఫోన్జేశాను.

ఏమిటి సంగ‌తి అన్నారాయ‌న కూల్ గా … మీరు ఈవెనింగ్ తొంద‌ర‌గా రావాల‌న్నాను. దేనికో చెప్పాల‌ని అప్పుడే వ‌స్తాన‌ని లిటికేష‌న్ పెట్టాడు. చెప్పాను… బాబు విష‌యం మాట్లాడాల‌ని … వెంట‌నే ఎస్కేపిజంలోకి వెళ్లిపోయాడు… అంద‌రు బ్ల‌డీ మేల్స్ లాగే … ఫ‌స్ట్ యునో ఒన్ థింగ్ … మేల్స్ ఆర్ ఎస్కేపిస్ట్స్ … ఓకే … దెన్ లిజ‌న్ .. ప‌లాయ‌నం చిత్త‌గించ‌డంలో మ‌గ‌వాళ్ల‌ని మించిన వాళ్లు లేరు అని తెలుగు అనువాదం … తెల్సింది క‌దా ఇక వినండి.

నీకు వాడి విష‌యంలో రెస్పాన్సిబిలిటీ లేదా అని ఓ గంట సేపు ఫోన్ లో వాష్ చేస్తే … ఒప్పుకున్నాడు. ఈవెనింగ్ ఎర్లీగా వ‌చ్చి మాట్లాడ‌తాను వాడితో అన్నాడు. నేను స‌రే అని ఎంత వ‌ర‌కు మాట మీద నిల‌బ‌డ‌తాడో చూద్దామ‌ని వెయిట్ చేస్తున్నా … వాడు వాడి ప‌ద్ద‌తిలో వాడు ఫోను ఆడుకుంటున్నాడు.. ఏ మేర‌కు వాడ్ని సెట్ రైట్ చేస్తాడో చూద్దామ‌ని చాలా యాంగ్జైటీతో ఉన్నాన్నేను.

వాడికి చెప్పా … డాడీ నీ తోలు తీసేయ‌డానికి వ‌స్తున్నాడ‌ని … డాడీనా నా తోలా … అని హ‌హ‌హ అని న‌వ్వేసి ఫోన్లోకి జంప్ చేసేసాడు.. దుర్మార్గుడు.. ఇలా వెయిట్ చేస్తుండ‌గా మా సార్ వ‌చ్చేశారు..వ‌స్తూనే చాలా సీరియ‌స్ గా … బ్యాగ్ నాకిచ్చి తిన్న‌గా వాడు కూర్చున్న సోఫా ద‌గ్గ‌ర‌కు పోయి … వాడితో ఆర్గ్యుమెంట్ కు దిగాడు. వై యుఆర్ నెగ్లెక్టింగ్ యువ‌ర్ స్డ‌డీస్ అని మొద‌లెట్టి కంటిన్యూస్ గా … ఫిఫ్టీన్ మినిట్స్ వాడ్ని చెడా మ‌డా తిట్టేశాడు.

ష‌డ‌న్ గా సునామీ లో చిక్కుకున్నట్టు మొహం పెట్టేసాడు వాడు. నాకు ఒక్క‌సారి ఏడుపొచ్చేసింది.. ఏదో పిల్ల‌ల్ని దారిలో పెట్టుకోవాల‌ని చెప్తే … మ‌రీ ఇంత వైలెంట్ గా ఎటాక్ చేయాలా? దిజ్ మేల్స్ ఆర్ సో ఇర్రెస్పాన్సాన్సిబుల్ .. అండ్ యార‌గంట్ ఫెలోస్ … అనిపించి … హాఫెన‌వ‌ర్ త‌ర్వాత ఐ ఎంట‌ర్ ఇన్ టూ డ్రాయింగ్ రూమ్ అన్న‌మాట‌.. బ‌న్నీగాడు .. పూర్తిగా స‌ఫ‌కేటివ్ గా అయిపోయాడు.. మొహం అంతా ఎర్ర‌గా అయిపోయింది … ఏడ్చి ఏడ్చి క‌ళ్లు వాచిపోయి ఉన్నాయి… ఆర్ యు బీట్ హిమ్ అని అడిగాను సురేష్ ని … స్ట్రెయిట్ గా.

నో … ఐ డోంట్ అంటే స‌రిపోతుంది క‌దా … డోంట్ ఇంట‌ర్ ఫియ‌ర్ ఇన్ దిస్ మేట‌ర్ అని ఒక్క‌సారి అరిచాడు … నా వైపు తిరిగి .. నాకొక్క‌సారి కోపం వ‌చ్చేసింది… సురేష్ యు హ‌ర్టింగ్ మీ అని నేనూ అరిచా … త‌ను చేతిలో ఉన్న క‌ళ్ల‌జోడును కిందేసి కొట్టేసి యు డోంట్ ఇంట‌ర్ ఫియ‌ర్ అని మ‌ళ్లీ అరిచాడు.. బ‌న్నీగాడు హ‌డ‌లిపోయాడు… సురేష్ ద‌య్యం ప‌ట్టిన‌ట్టు అయిపోయాడు… సురేష్ నేను పిల్ల‌వాడ్ని కాస్త రైట్ డైర‌క్ష‌న్ లో పెట్ట‌మ‌ని చెప్పానంతే త‌ప్ప వాడ్ని క్రూయ‌ల్ గా హింసించ‌మ‌ని చెప్ప‌లేదు అన్నాను.

యు డోంట్ ఇంట‌ర్ ఫియ‌ర్ ఇన్ అవ‌ర్ ఇష్యూస్ అని బ‌న్నీగాడ్ని ఎత్తుకుని పైకెళ్లిపోయాను…అంతే త‌ను చాలా రాష్ గా బ‌య‌ట‌కు పోయి కారు తీసుకుని వెళ్లిపోయాడు… నైటంతా ఇంటికి రాలేదు… నేనూ ప‌ట్టించుకోలేదు… మార్నింగ్ కూడా రాలేదు… నాకు అర్ధ‌మైంది .. సురేష్ ఎక్క‌డున్నాడో … ప్ర‌శాంత్ కి ఫోన్ చేస్తే చ‌ప్పాడు.. వాళ్ల రూంలోనే ప‌డుకుని పొద్దున‌నే ఆఫీస్ కి వెళ్లిపోయాడు… ఓకే అనుకున్నా. 

ఈవెనింగ్ వ‌చ్చాడు… నేనూ ఏమీ మాట్లాడ‌లేదు.. త‌న ప‌నులు తాను చేసుకుని భోం చేసి ప‌డుకున్నాడు త‌ప్ప ఏమీ మాట్లాడ‌లేదు… మేల్ ఇగో చూశారా… (పిల్లోడి ని దారిలో పెట్ట‌మ‌ని పిల్చిందీ ఈవిడే … వాడితో మాట్లాడుతుంటే మ‌ధ్య‌లో వ‌చ్చి వాడ్ని వెన‌కేసుకొచ్చి తిట్టిందీ ఈవిడే పైగా మేల్ ఈగో అంట ….)య‌స్ మేల్ ఈగోనే … న‌న్ను అడిగి … నేను చెప్పిన లిమిటేస‌న్స్ లోనే క‌దా త‌ను యాక్ట్ చేయాల్సింది. 

అలా చేయ‌లేదు క‌నుక మేల్ ఈగోనే … (అయ్య‌బాబోయ్ … పాపం సురేషు … ఆ గ‌దిలో ఏమాలోచిస్తున్నాడో పాపం … వ‌చ్చే జ‌న్మ‌లో అయినా భార్య‌గా పుట్టి వీళ్ల తోలు తీయ‌క‌పోతానా అని ఆలోచిస్తున్న‌ట్టున్నాడు పాపం … )యునో .. గృహ‌ల‌క్ష్మి అంటే ఏమిటో తెల్సా? … గృహ‌మంతా కంట్రోల్ లో పెట్టుకోవ‌డ‌మే … అలా పెట్టుకోని వారెవ‌రూ గృహ‌ల‌క్ష్ములు అనిపించుకోలేరు. యునోద‌ట్ … ద‌టీజ్ ఇష్యూ … ఇప్పుటికైనా తెల్సిందా … మ‌నం మేల్ డామినేటింగ్ సొసైటీలో ఉన్నామ‌ని అర్ధ‌మైందా … ఓకే ఫ్రెండ్స్ … మ‌రో ఇంట్రస్టింగ్ టాపిక్ తో మ‌ళ్లీ క‌లుద్దాం. అంట‌ల్ దెన్ బైబై .. టేక్కేర్ …

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!