రకుల్ పెళ్లికూతురాయనే !!

Sharing is Caring...

Rakul preethi getting married……………………..

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి  మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి పీటలెక్కబోతున్నారు. 33 ఏళ్ళ రకుల్ ప్రీతీ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహం ఫిబ్రవరి 21న గోవాలో జరగనుంది.

ఈ వివాహా వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. రకుల్‌ప్రీతీ -జాకీల పెళ్ళికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మూడు రోజుల పాటు ఈ జంట  వివాహ వేడుక జరగనుంది. రోజుకొక డిజైనర్ రూపొందించిన పెళ్లి దుస్తుల్ని వీరు ధరించబోతున్నారట. ప్రముఖ డిజైనర్లు సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 

గిల్లి’ అనే కన్నడ సినిమాతో నటిగా రకుల్‌ సినీ రంగంలోకి ప్రవేశించారు. 2011లో ‘కెరటం’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చారు. 2013లో రిలీజైన   ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తెలుగు సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత రకుల్ కి  తెలుగులో  అవకాశాలు వచ్చాయి.

‘లౌక్యం’, ‘పండగ చేస్కో’, ‘సరైనోడు’ చిత్రాలలో నటించారు. అలాగే  ‘ధృవ’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘స్పైడర్’ చిత్రాల్లో కూడా యాక్ట్ చేశారు. చివరిసారిగా రకుల్ 2021లో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండపొలం’లో హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్న రకుల్  హిందీ,తమిళ్ చిత్రాల్లో నటిస్తున్నారు. రకుల్ నటించిన ‘అయలాన్‌’ సంక్రాంతికి  రిలీజయింది. బీటౌన్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లోనే రకుల్  ప్రకటించారు. కమల్ హాసన్ సినిమా ‘ఇండియన్ 2’లో నటించనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆ ఆఫర్ వర్కౌట్ అయినట్టులేదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!