Rise vs Rule …………………………………
హీరో అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలబడి సత్తా చాటుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన మూవీగా కూడా రికార్డుల్లోకి ఎక్కింది. పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో పార్ట్ 2 ని ఆసక్తికరంగా రూపొందించే యత్నాల్లో ఉన్నారు దర్శకుడు సుకుమార్.ఇప్పటికే పార్ట్ 2 కి సంబంధించి కొన్ని సన్నివేశాలను సుకుమార్ చిత్ర్రీకరించారు. అయితే అవి సంతృప్తికరంగా లేకపోవడంతో మళ్ళీ రీ షూట్ చేయలనుకుంటున్నారట. అలాగే స్క్రిప్ట్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయ బోతున్నారని సమాచారం. ఆ మధ్య ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ ఈ విషయం చెప్పారు.
అలాగే అల్లు అర్జున్ ఇతర సాంకేతిక నిపుణులతో కూడా షూటింగ్ ప్లాన్ గురించి సుకుమార్ చర్చించారు. అయిదారు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. మొత్తం 250 రోజుల్లో ‘పుష్ప 2’ షూటింగ్,ఇతర పనులు పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు.
‘పుష్ప’ తొలి భాగం షూటింగ్ 210 రోజుల పాటు సాగింది. ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ఉంటే అనుకున్న తేదీకే విడుదల చేస్తారు.పుష్ప పార్ట్ 2 పై కూడా అభిమానులు పెద్ద అంచనాతో ఉన్నారు. పరిశ్రమ వర్గాలు పుష్ప రెండో భాగం కూడా సూపర్‌హిట్ అవుతుందని …చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. బాహుబలి 2 ని మించి వసూళ్లు సాధిస్తుందని అంచనాలో ఉన్నారు .
ఇక పుష్ప సీక్వెల్ లో మరిన్ని ట్విస్టులు .. ఎంటర్టైన్మెంట్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్ట్ 2లో ఫహద్ ఫాసిల్, అనసూయ పాత్రల్తోపాటు మరి కొన్నిపాత్రలు కథలో కీలకం కావచ్చని సమాచారం. సాంగ్స్ పై సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ఫిలిం సర్కిల్స్ టాక్.
పుష్ప1 లో చాలా క్యారెక్టర్స్ ని పెట్టారు.కానీ వాటికి న్యాయం జరగలేదు. అన్నిపాత్రలకి తగిన డ్రామా పండ లేదు.సినిమాలో ఏ పాత్ర తోటి ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడదు. లవ్ ట్రాక్ ని కామెడితో మిక్స్ చేసి లైట్ గా తీసుకున్నారు. ఏ రొమాంటిక్ సీన్ గుండెను తాక లేదనే విమర్శలు వచ్చాయి.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సుకుమార్ పార్ట్ 2 లో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మొదటి పార్ట్ స్పందనని బట్టి అవసరమైతే మార్పులు చేస్తామని సుకుమార్ ఇదివరకే చెప్పారు. మరిప్పుడు ఏ మార్పులు చేస్తారనేది సస్పెన్స్.