కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా……. 

Sharing is Caring...

పై ఫొటోలో కనిపించే మహిళ పేరు …లతికా సుభాష్. కేరళ మహిళా కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షురాలు. పార్టీ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదని నిరసన తెలియజేస్తూ తిరువనంతపురం పార్టీ కార్యాలయం ముందు శిరోముండనం చేయించుకున్నారు. పార్టీ లో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ 86 మందితో లిస్ట్ ప్రకటిస్తే అందులో 9మందికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చారని ఆమె పార్టీ నేతల తీరును దుయ్యబడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన మొండి చేయి చూపారని ఆమె విమర్శిస్తున్నారు. ఎట్టు మానూరు నియోజకవర్గం నుంచి మాత్రమే టిక్కెట్ కావాలని లతికా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని యూడీఎఫ్ అభ్యర్థి కి కేటాయించింది. వేరే స్థానం నుంచి అవకాశం కల్పిస్తామని రాష్ట్రనేతలు చెప్పినా లతికా పట్టు వీడలేదు. ఇక చేసేదేమిలేక  పార్టీ నాయకులు సైలెంట్ అయిపోయారు.

పార్టీ నేతల నుంచి స్పందన లేకపోవడంతో లతికా సుభాష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.  ఆటో రిక్షా గుర్తు కూడా లభించింది. నియోజక వర్గంలో ప్రచారం చేపట్టి దూసుకుపోతున్నారు. వేరే పార్టీ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా అంటున్నారు లతికా. అన్నిరంగాల్లో మహిళలను చిన్న చూపు చూస్తున్నారు. అందుకు నిరసనగానే శిరోముండనం చేయించుకున్నా అంటున్నారు. మహిళల ఓట్లు తనకే పడతాయంటున్నారు. కుల,మతాలకు అతీతంగా ప్రజలు తనను గెలిపిస్తారని లతికా భావిస్తున్నారు.

లతికా శిరోముండనం చేయించుకోవడం నిజంగా సాహసమే. దాంతో ఆమె మీడియా దృష్టిలో పడ్డారు. జాతీయ మీడియాలోకి కూడ లతికా కు సంబంధించిన వార్తలు ప్రచురితమైనాయి. గతంలో ఎక్కడా ఇలా జరగలేదు. పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి తిరస్కరిస్తే  ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి సత్తా చూపేవారు. అదలావుంటే  ఎట్టు మానూరు అసెంబ్లీ నియోజకవర్గం లో సీపీఎం పార్టీ కి మంచి పట్టు ఉంది. 2011, 2016 ఎన్నికల్లో అక్కడ నుంచి సురేష్ కురూప్ గెలిచారు. ఈ సారి వాసవన్ పోటీచేస్తున్నారు. బీజేపీ నుంచి హరికుమార్,  కేరళ కాంగ్రెస్ నుంచి ప్రిన్స్ లుకోజ్ పోటీ పడుతున్నారు. ఇంకా బీఎస్పీ, ఇండిపెండెంట్లు బరిలోఉన్నారు. వీరందరిని లతికా ఢీ కొనాలి.ఇక్కడ ఎన్నికలు ఏప్రిల్ 6 న జరుగుతాయి. మే 2 న ఫలితాలు వస్తాయి.

—————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!