ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయానికి సన్నాహాలు !

Sharing is Caring...

IDBI Bank  …………………………………….ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బ్యాంక్ ఈక్విటీలో కేంద్ర ప్రభుత్వానికి, ఎల్ఐసీ సంస్థకు  అధిక భాగం వాటాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ పూర్తవుతుంది. రెండేళ్ల క్రితం ఐడీబీఐ బ్యాంక్ సంక్షోభంలో పడినపుడు ప్రభుత్వ ఒత్తిడితో ఎల్ఐసీ కార్పొరేషన్ ఒక్కో బ్యాంక్ షేర్ ను రూ. 37.90 చొప్పున తీసుకున్నది. అలా ఐడీబీఐ బ్యాంక్ ఈక్విటీలో రెండో సారి అయిదు శాతం వాటాను కొనుగోలు చేసింది.అయిదేళ్ల తర్వాత బ్యాంక్ లాభాల బాటలో పడింది. ఐడీబీఐ బ్యాంక్ 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం లో 1359 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది.

అంతకు ముందు సంవత్సరం 2019-20లో బ్యాంక్ 12,887 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది బడ్జెట్ లో ఐడిబిఐ బ్యాంక్ వాటాలను విక్రయించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ బ్యాంక్ లో ప్రభుత్వానికి 45. 5 శాతం వాటా ఉన్నది. ఎల్ ఐ సీ మెజారిటీ షేర్లు కొనుగోలు చేసిన తరువాత బ్యాంకును ప్రైవేట్ బ్యాంక్ గా వర్గీకరించారు.  
ఎల్ ఐ సి ఈ బ్యాంక్ ను ప్రారంభించినపుడు 21000 కోట్లరూపాయలు పెట్టుబడి పెట్టింది. అంటే 51 శాతం వాటా ఎల్ఐసీ చేతిలోనే ఉంది. తాజాగా అటు కేంద్ర ప్రభుత్వం .. ఇటు ఎల్ఐసీ తమ వాటాలను విక్రయించాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 

ప్రభుత్వ పెట్టుబడులు,నిర్వహణ విభాగం అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. వాటాల విక్రయం పబ్లిక్ ఇష్యూ ద్వారా నా లేక పబ్లిక్ ఆఫర్ ద్వారా చేస్తారా ? ఎంత శాతం ఈక్విటీ ని అమ్ముతారు అనే అంశాలు ఖరారు కావాల్సి ఉంది.ఆర్ధిక సంస్థలకు, ఇతర సంస్థలకు వాటాలను ఎలా కేటాయించాలి అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రయివేటీకరణ ప్రక్రియ బ్యాంక్ ఉద్యోగులు,కస్టమర్ల పై ఎలాంటి ప్రభావం చూపదని అంటున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 1. 75 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా,భారత్ పెట్రోలియం,షిప్పింగ్ కార్పొరేషన్,కాంకర్ , ఎల్ఐసీ సంస్థల వాటాలను విక్రయిస్తున్నది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ షేర్లు రూ. 38.70 ట్రేడ్ అవుతున్నాయి. డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ద్వారా షేర్ ధరల్లో ఓ మాదిరి కదలిక ఉండొచ్చు. ధరలు తగ్గినపుడు ధీర్ఘకాలాన్నిదృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్ చేయవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!