చౌక ధరలో పోస్టల్ ప్రమాద బీమా !

Sharing is Caring...

Attractive insuerance scheme ………………………….

ఎప్పుడు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతాయో ఎవరికి తెలీదు.  ప్రమాదాలను ప్లాన్ చేయలేము కానీ ప్రమాదాలవల్ల అయ్యే ఖర్చుల నుంచి ఎలా బయట పడాలో ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రమాద బీమా కట్టి అనుకోకుండా వచ్చే ప్రమాదాల నుంచి గట్టెక్కవచ్చు.

అదృష్ట‌వ‌శాత్తు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డితే ఒకే ..  ఆ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి.. అటుపై మృత్యువాత ప‌డితే మటుకు  ఆయా కుటుంబాల వేద‌న వ‌ర్ణ‌నాతీత‌మే. కుటుంబ య‌జ‌మాని చనిపోతే ఆ కుటుంబం పూర్తిగా స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా  ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌మాద బీమా చేయించుకుంటే.. త‌మ కుటుంబాల‌ను ఆదుకున్న వార‌వుతారు.

ఎల్ఐసీతో జీవిత బీమా.. త‌ర్వాత  ఆరోగ్య సేవ‌ల కోసం హెల్త్ బీమా..ప్ర‌మాదాల‌తో  వ్య‌క్తులు,  కుటుంబాలు ఇబ్బందుల్లో ప‌డ‌కుండా ప్ర‌మాద బీమా స్కీమ్‌లు వ‌చ్చేశాయి. ఈ రంగంలోకి పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చేసింది.  టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ సంస్థ‌తో కలసి ప్రమాద బీమా పధకాలను ఆఫర్ చేస్తోంది. 

పోస్టాఫీసు  త‌న ఖాతాదారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డు పేరిట టాటా ఏఐజీ ఇన్సూరెన్స్‌తో క‌లిసి ప్ర‌మాద బీమా పాల‌సీ ని  తీసుకొచ్చింది. ఈ పాల‌సీ కింద ఏటా రూ.399 చెల్లిస్తే చాలు. ఆ పాలసీ కింద రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా క‌వ‌రేజీ ల‌భిస్తుంది. ఈ ప‌థ‌కం కింద పాల‌సీ దారుల‌కు ఇత‌ర ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

18 ఏళ్ళు దాటిన వారు మొద‌లు 65 ఏళ్ళ లోపు వృద్ధుల వ‌ర‌కు ఈ టాటా ఏఐజీ వారి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ బీమా పాల‌సీలో చేరొచ్చు. ఈ పాల‌సీలో చేరగోరే వారు పోస్ట‌ల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతా తీసుకోవ‌డం తప్ప‌నిస‌రి. పోస్ట‌ల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచే ప్రీమియం చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ బీమా పాల‌సీ పొందిన వారు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించినా, శాశ్వ‌త అంగ వైక‌ల్యం చెందినా, ప‌క్ష‌వాతానికి గురైనా, ఏదైనా అవ‌య‌వాన్ని కోల్పోయినా రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లిస్తుంది పోస్ట్ ఆఫీస్.  
ఇక రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌పేషంట్‌కు ఐపీడీ కింద గానీ, క్ల‌యిమ్ రూపేణా గానీ రూ.60 వేలు.. వీటిలో ఎది త‌క్కువైతే అది చెల్లిస్తుంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప‌ది రోజుల వ‌ర‌కు రోజూ రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఔట్ పేషంట్‌గా చికిత్స పొందుతున్న‌ట్లైతే రూ.30 వేలు గానీ, క్ల‌యిమ్ రూపంలో గానీ.. ఏది త‌క్కువైతే అది చెల్లిస్తారు.

అత్య‌ధికంగా ఇద్ద‌రు పిల్ల‌ల విద్యా సంబంధ అవ‌స‌రాల కోసం మొత్తం బీమా పాల‌సీలో 10 శాతం అంటే రూ. ల‌క్ష చెల్లిస్తారు. కుటుంబ ప్ర‌యోజ‌నాల కోసం రూ.25 వేలు, మ‌ర‌ణించిన వ్య‌క్తి అంత్య క్రియ‌ల కోసం రూ.5000 పే చేస్తారు.

ఈ బీమా పాల‌సీలో పోస్ట్ ఆఫీస్  మ‌రో ఆప్ష‌న్ క‌ల్పించింది. రూ.299 ల‌కే రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా సౌక‌ర్యం కూడా ఉంటుంది. ఇందులో మ‌ర‌ణం, శాశ్వ‌త అంగ వైక‌ల్యం, ప‌క్ష‌వాతం వంటి అంశాల‌కు మాత్రమే క‌వ‌రేజీ ల‌భిస్తుంది. ఖాతాదారులు తక్కువ సొమ్ముతో ఈ బీమా పధకాలను  
కొనుగోలు చేయవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!