ఈ బ్యాంక్ షేర్లపై ఓ లుక్కేయండి !

Sharing is Caring...

Suitable for investment………………………..బంధన్‌ బ్యాంక్‌ పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. బ్యాంకు లాభాల బాటలో పయనిస్తున్నది. 2015 లో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. కలకత్తా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు ప్రస్తుతం 4701 ఔట్లెట్స్ తో పనిచేస్తున్నది. మైక్రో ఫైనాన్స్‌ విభాగం(ఎంఎఫ్‌ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలబడింది.తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2 కోట్ల కస్టమర్లకు సేవలు అందిస్తోంది.

2021 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు మొత్తం డిపాజిట్లు 28% పెరిగి రూ.77,336 కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2020 నాటికి రూ. 66 వేల కోట్లు మాత్రమే.  డిసెంబర్ 2021తో ముగిసిన త్రై మాసికంలో నికర లాభం రూ. 858.97 కోట్లు కాగా డిసెంబర్ 20 తో ముగిసిన త్రై మాసికంతో పోలిస్తే  35.79% పెరిగింది. అప్పట్లో నికర లాభం రూ. 632.59 కోట్లు మాత్రమే.అలాగే నిర్వహణ లాభం రూ.1,950.15 కోట్లకు చేరుకుంది.  డిసెంబర్ 20 తో పోలిస్తే 1.88% పెరిగింది. డిసెంబర్ 2020లో 1,914.08 కోట్లు మాత్రమే.

2019 మార్చినాటికి  బ్యాంకు ఆదాయం 7706 కోట్లు కాగా 2020 మార్చినాటికి 12434 కోట్లకు పెరిగింది. అదేవిధంగా  మార్చి 19 నాటికీ 1951 కోట్లు నికర లాభం ఆర్జించగా 2020 మార్చినాటికి అది 3023 కోట్లు కు పెరిగింది. ఇక నికర రాని బకాయిలు 389 కోట్లు ఉన్నాయి.  వాటిని వసూలు చేసేందుకు బ్యాంకు ప్రయత్నిస్తోంది. మార్చి 2022 తో సంవత్సర కాలంలో ఆకర్షణీయమైన ఫలితాలను సాధించగలదని అంచనా వేస్తున్నారు.

డిసెంబర్ 2021 నాటికి బంధన్ బ్యాంక్ ఈపీఎస్ రూ. 5.33 కి పెరిగింది. కాగా డిసెంబర్ 2020లో 3.93.మాత్రమే. రానున్న ఐదేళ్ల కాలంలో బ్యాంకింగ్‌ సౌకర్యాలను మరింతగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం రూ. 326 వద్ద బ్యాంక్ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి.  52 వారాల గరిష్ట ధర  రూ. 371 కాగా కనిష్ట ధర రూ. 229 మాత్రమే.

స్వల్పకాలిక వ్యూహంతో ధర తగ్గినపుడు ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ముందే తక్కువ ధర వద్ద కొన్న ఇన్వెస్టర్లు ప్రస్తుత ధర వద్ద షేర్లను అమ్మేసి లాభాలను స్వీకరించ వచ్చు. మళ్ళీ ధర తగ్గినపుడు అప్పటి పరిస్థితిని బట్టి మళ్ళీ కొనుగోలు చేయవచ్చు. గోల్డ్‌మన్ సాచ్స్ రూ. 440 టార్గెట్‌తో బై కాల్ ఇచ్చింది.

నోట్ ….. ఇన్వెస్టర్ల అవగాహన కోసమే ఈ విశ్లేషణ. ఆలోచించి ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోండి.

——-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!