ఇప్పటికే సూపర్ హిట్ అయిన “మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా” పాటతో ప్రేక్షకుల మనసులో పాజిటివ్ నోట్ నాటుతూ మొదలవుతుంది వకీల్ సాబ్ సినిమా…ఆ పాట తర్వాత, వేముల పల్లవి, జరీనా బేగం, దివ్యా నాయక్ అనే ముగ్గురు ఆడపిల్లలు ఒక అనుకోని సంఘటనలో ఇరుక్కోవడం…… జనాల కోసం వందల ఎకరాల భూమిని పంచి అన్యాయం జరిగే చోట బాధితులకు అండగా వుంటూ, ఆ క్రమంలో గర్భిణీ అయిన తన భార్యని పోగొట్టుకుని నిరాశలో కూరుకుపోయి మందుకి బానిస అయిన లాయర్ సత్యదేవ్ కథ ఇది.
ఆ ముగ్గురు ఆడపిల్లల్ని కనెక్ట్ చేసే సన్నివేశాలతో తరువాతి 55 నిమిషాలు పెద్ద గొప్పగా లేకపోయినా ప్రేక్షకులకు బోర్ కొట్టనివ్వకుండా కథ నడుస్తుంది. గడిచిపోతాయి…ఇంటర్వెల్ ఇంకో పది నిమిషాల్లో వుందనగా సినిమాలో వేగం మొదలవుతుంది. అలా వేగం పుంజుకున్నాక, ద్వితీయార్థం మొత్తం ప్రేక్షకులని కుర్చీలకు కట్టిపడేస్తుంది…ఇంకోలాగా చెప్పాలంటే సినిమాకి ఆయువుపట్టు సెకండ్ హాఫ్…రెండో సగభాగం దాదాపు కోర్టు సీన్స్ తోనే గడుస్తుంది… లాయర్ సత్యదేవ్, లాయర్ నందా మధ్య నడిచే కోర్టు సన్నివేశాలు చాలా ఉత్కంఠగా ఉంటాయి.
కోర్టు సీన్లలో లాయర్ సత్యదేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటన అత్యద్భుతం… పీకే వన్ మ్యాన్ షో తో సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయాడు..అతని అభిమానుల ఆనందానికయితే హద్దు ఉండదు అని ఖచ్చితంగా చెప్పగలను…పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్తేజపరుస్తూ, జనసేన కార్యకర్తలని మోటివేట్ చేసే డైలాగ్స్ చాలా వున్నాయి సినిమాలో… నివేదా థామస్, అంజలి, అనన్య చాలా అంటే చాలా బాగా నటించారు…ప్రకాష్ రాజ్ తో సహా మిగతా నటులు ఏదో ఫర్లేదు అనిపిస్తారు….దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాను బాగానే తీసాడు. పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని కథను మలుచుకున్నారు. చివరగా చెప్పొచ్చేదేంటంటే వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్…. పీకే అభిమానులకు ఉగాది పండుగ ముందు వచ్చిన మరో పెద్ద పండుగ వకీల్ సాబ్….నా రేటింగ్ 3.75/5..