మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలోని సాత్పురా పర్వతాల్లో పాండవ గుహలు ఉన్నాయి. పాండవులు వనవాస సమయం లో ఈ గుహల్లో ఉన్నారని అంటారు. బ్రిటిష్ కాలంలో సెంట్రల్ ఇండియా ప్రావిన్స్ లో అధికారి గా చేసిన జేమ్స్ ఫార్సిథ్ ఈ గుహలను కనుగొన్నారు. జేమ్స్ ప్రకృతి ప్రేమికుడు కావడం తో కొండలు, కోనల్లో విహరించే వాడు. సాత్పురా వింధ్య పర్వత పంక్తుల్లోని పచ్చదనం చూసి మైమరిచిపోయేవాడు. అలా ప్రకృతిలో విహరిస్తుండగా ఈ కొండ పై గుహలు ఆయన కంట పడ్డాయి.
పాంచ్ అంటే ఐదు అని.. మడి అంటే గుహ అని అర్ధం. ఆ ప్రాంతానికి క్రమేణా పాంచ్ మడి అనే పేరు స్థిరపడిపోయింది. అదే పచ్ మడి అయింది .. పంచ్ మర్హి అని కూడా పిలుస్తారు. ఇప్పటికి అక్కడ పాండవుల గుహలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇవన్నీ విశాలంగా ఉంటాయి. గుహల్లోపల బండలపై రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. సరైన పరిరక్షణ లేకపోవడంతో కొన్ని చెడిపోయాయి. గుహల ముందు ఉద్యానవనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు.
ఒకప్పుడు ఈ ప్రాంతం భౌద్ధారామంగా విలసిల్లిందని కూడా అంటారు.ఈ గుహలు మహాభారతం తర్వాత వచ్చే గుప్తుల కాలానికి చెందినవని అంటారు. అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధ సన్యాసులు ఇక్కడ ఉన్నారని చెబుతారు.ఈ కొండపై చిన్న స్థూపం కూడా ఉంది. బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసే ప్రదేశం అని స్థానికులు అంటారు. అయితే ఈ గుహ పాండవులదే అనే వాదన కూడా ఉంది. పాండవ గుహలుగానే భావిస్తూ పర్యాటకులు దీనిని సందర్శిస్తున్నారు.
ఈ సాత్పుర పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశం దూప్గఢ్ వ్యూ పాయింట్. ఇది 4,430 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతమంతటిని ఈ వ్యూ నుంచి తిలకించవచ్చు. సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయం కూడా ఇక్కడ నుంచి చూడవచ్చు. పచ్మఢీలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఇక్కడే మరికొన్ని సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. భోపాల్ చేరితే అక్కడ నుంచి బస్సు సదుపాయం ఉంది. టాక్సీ లు కూడా అందుబాటులో ఉంటాయి.
Watch Vedeo …………………………………. పాండవుల గుహలు !