ఇక పాత్రల ఎంపికలో తగ్గేదెలే !!

Sharing is Caring...

మాస్ క్యారెక్టర్స్ లో అందరూ రాణించలేరు. అలాంటి పాత్రలు అందరికి నప్పవు కూడా. ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి పుష్ప లాంటి ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటించడం గొప్ప విషయమే.అర్జున్ ఆ క్యారెక్టర్ కు బాగా సూటయ్యారు. పాత్రలో పుష్పమాత్రమే కనిపించాడు కానీ బన్నీ కనిపించలేదు.

రచయిత ఆ పాత్రను డిజైన్ చేసిన విధంగానే నటించి మెప్పించాడు. సినిమా హిట్ అయిందా ? వసూళ్లు ఎంత అన్నవిషయాలు పక్కన బెడితే  అర్జున్ ఆ పాత్రకు న్యాయం చేసాడనే చెప్పుకోవాలి. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘పుష్ప’ సినిమా అల్లు అర్జున్‌ వన్‌మ్యాన్‌ షో అనే చెప్పుకోవాలి. ఆపాత్ర చుట్టూనే కథను నడిపారు. సినిమా మొదలైనప్పటినుంచి నుంచి ప్రేక్షకులకు పుష్ప రాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు. పుష్ప మాస్‌లుక్‌ పై సుకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఆయన ఆశించిన విధంగానే పాత్రలో బన్నీ అదరగొట్టేశాడు.బాడీ లాంగ్వేజ్ లో మార్పు చూపిస్తూనే .. చిత్తూరు యాస ను కూడా అర్జున్ బాగా పట్టుకున్నాడు. చిత్తూరు యాసలో బన్నీ పలికే డైలాగ్స్‌ అభిమానులను అలరిస్తాయి. ఇక యాక్షన్ సన్నివేశాల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రతి సన్నివేశంలోనూ ‘తగ్గేదేలే’అన్నట్లు అల్లు అర్జున్‌ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. బన్నీకెరీర్లో పుష్ప పాత్రదే  బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పుకోవచ్చు.  

పుష్ప పాత్రను బన్నీ మినహా మరొకరు చేయలేరేమో అనే స్థాయిలో చేసాడని అభిమానులు సంబర పడుతున్నారు. ఇప్పటి వరకు సాఫ్ట్ హీరో గా చేసిన అల్లు అర్జున్ కి ఇదొక వెరైటీ పాత్ర. సుకుమార్ ప్రతి సన్నివేశంలో ఆ పాత్రను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. పుష్ప లుక్‌, కాస్ట్యూమ్స్, ఎడమ భుజం పైకి ఎత్తి పెట్టే తీరు ..తగ్గేదేలే అన్నఊతపదం…ఆపాత్ర ఎలివేట్ కావడానికి దోహదపడ్డాయి.

ఇలాంటి పాత్ర చేయడానికి సహజంగా హీరోలు సాహసించరు. పుష్ప స్టోరీ నచ్చకనే మహేష్ బాబు అప్పట్లో ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసాడని కొన్ని కథనాలు ప్రచారంలో కొచ్చాయి. మహేష్ బాబు కూడా సుకుమార్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా వర్కవుట్ కావడం లేదని ట్వీట్ కూడా చేసాడు.పుష్ప వంటి మాస్ పాత్ర స్వరూపం … దాని లుక్ సుకుమార్ మహేష్ బాబు కి వివరించే ఉంటారు.

అది తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ కాదని మహేష్ తిరస్కరించి ఉండొచ్చు. వెనుకడుగు వేసి ఉండవచ్చు. సినిమా చూస్తే ఎవరికైనా అదే ఫీలింగ్ కలుగుతుంది. సుకుమార్ కథ కు మహేష్ అసలు సూట్ కాడు. అలాంటి రఫ్ క్యారెక్టర్.. బవిరి గడ్డం ..ఒక గూడ ఎత్తి వెరైటీగా నడవడం మహేష్ బాబుకి అసలు నప్పదని అనుకుంటారు.

ఒక వేళ మహేష్ ఒకే అని ఉంటే ఆ పాత్రను వేరేవిధంగా మౌల్డ్ చేసేవారేమో. ఈ సినిమా హిట్ కొట్టిన నేపథ్యంలో ఇక ముందు మరిన్ని వెరైటీ పాత్రల్లో నటించి సత్తా చాటాలని బన్నీ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇకపై  ఏమాత్రం “తగ్గేదేలే “అంటున్నారట బన్నీ.అన్నట్టు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవాళ్లు చూడవచ్చు 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!