Low budget movie ……………………………….
చిన్నసినిమాని బ్రతికిద్దాం “మనుషులంతా ఒక్కటే” అన్న నినాదం లాంటిదే. సినీ పరిశ్రమలో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏదీ ఉండదు ఉన్నది ఒక్కటే సినిమా అనే మాట కూడా. గతంలో థియేటర్ లలో అన్ని సినిమాలకు ఆదరణ ఉన్న కాలం లో పైన చెప్పిన మాటల్లో కొంచం నిజముందేమో కానీ ఈ పాన్ ఇండియా సినిమాలు, ott ల కాలం లో కాదు.
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు .. ఎన్నోరూపాల్లో వినోదం అందుబాటులో ఉన్నట్టే. పెద్ద పెద్ద సినిమాలే
I Bomma లాంటి పైరసీ app లలో చూద్దాము అని నిర్ణయం తీసుకుంటున్న ప్రేక్షకులు ఉన్న కాలం లో చిన్న సినిమా నిలబడాలి అంటే కచ్చితంగా ప్రేక్షకులు సహాయం ఉండాలి.
సినిమా అంటే ఆరు పాటలు,నాలుగు ఫైట్ లు కాదు కథా కాకరకాయ ఉండి తీరాలి అని భావించే ప్రేక్షకులకీ సంజీవని వంటిది చిన్న సినిమా. కాకపోతే ఈ తరహా చిత్రాల్లో బడ్జెట్ లేకపోవడం వల్లో,ఇతర కారణాల వల్లోపెద్ద సినిమాలలో ఉండే హంగులు కనపడవు. కానీ ఒక మంచి చిత్రాన్ని అందించేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిన బాధ్యత సినీ ప్రేమికులు మీద కచ్చితంగా ఉంది.
శాంతి నివాసం లాంటి సీరియల్ నుండే RRR రాజమౌళి గారు పుట్టారని, మన దేశం నుండే మన దేశానికి పీఎం అయ్యే స్థాయికీ ఎదిగిన ఎన్టీఆర్ వచ్చారని గుర్తుంచుకోవాలి,ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త తరానికి స్టార్ లను తయారు చెయ్యాలి. అలాంటి ఒక చిన్న చిత్రమే ఈ మద్యే యూట్యూబ్ లో విడుదల అయిన “ఖేల్”.
సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో 3కథలు సమాంతరం గా సాగుతుంటాయి. హైదరాబాద్ లో జాబ్ ట్రైనింగ్ కోసం వచ్చి ఒకమ్మాయి ప్రేమ లో పడ్డ అబ్బాయి,ఆ తరువాత పరిస్థితుల ప్రభావం వల్ల ఏ బాట పట్టాడు చివరికి ఏమైంది అన్నది ఒక కథ.
అలాగే రౌడీఇజం తో మాత్రమే పొలిటికల్ లీడర్ గా అవకాశాలు ఉంటాయి అని నమ్మే ఒక లీడర్ గమ్యం ఎక్కడికి చేరింది అన్నది ఇంకో కథ.తన చెల్లి పెళ్లి చెయ్యడానికి అవసరమయ్యే డబ్బులు కోసం దొంగతనం చెయ్యాలని చూసిన వ్యక్తి గురించి మరో కథ.
ఇలా 3కథలు ఉన్నా మొదటి అర్ధ భాగం ఎక్కువ గా ప్రేమ కథ ని చూపించి, రెండో అర్ధభాగం లో మిగిలిన రెండు కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చూపించాడు దర్శకుడు. కథాపరంగా కొత్తదనం అని కాకపోయినా ఒక మంచి అంశం తీసుకున్నాడు అని చెప్పవచ్చు.
సినిమాలో హీరో్లిద్దరూ వారి వారి పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ముగ్గురు హీరోయిన్ లలో మెయిన్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ నటన బాగుంది. ముఖ్యం గా చెప్పుకోవాల్సింది విలన్ కమ్ కమెడియన్ చేసిన బోనాల వెంకటేష్ పాత్ర గురించి. ఈ పాత్ర సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
నటుడిగా కూడా భవిష్యత్ లో అతనికి మంచి అవకాశాలు తెచ్చిపెట్టే పాత్ర అది. అలాగే సినిమా లోని ఇంకా కొందరు పాత్రధారుల నటన కూడా ఆకట్టుకుంటుంది. సంగీతం కూడా వినసొంపుగా ఉంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్,ఇంకో ప్రేమ పాట చాలా బాగున్నాయి.
మొదటి చితమైనా రచనా, దర్శకత్వం పరంగా దర్శకుడు మంచి మార్కులే సాధించాడు అని చెప్పచ్చు. గతంలో దర్శక నిర్మాత గా “సలాం హైదరాబాద్”అనే చిత్రాన్ని తీసిన పులి అమృత్ గౌడ్ నిర్మాణ సారథ్యం లో వచ్చిన మరో మంచి సినిమా ఇది.
2గంటల 16 నిముషాలు నిడివి గల ఈ సినిమా. యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
కింద లింక్ ద్వారా చూడచ్చు.