జగన్ లేఖపై మన లాయర్ల ది వ్యూహాత్మక మౌనమా ?

Sharing is Caring...

ఏపీ సీఎం జగన్  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రాసిన లేఖ పై ఢిల్లీ న్యాయవాదులు స్పందిస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఏ లాయర్ కూడా స్పందించినట్టు కన్పించలేదు. జగన్ సీజే కి లేఖ రాయడం పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్, మరి కొంతమంది లాయర్లు విరుచుకుపడ్డారు. జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం పదవి నుంచి తప్పించాలని కోరారు. కోర్టు ధిక్కరణ కు జగన్ పాల్పడ్డారు కాబట్టి చర్యలు తీసుకోవాలని మండి పడ్డారు. కొన్ని సంఘాలు తీర్మానాలు చేశాయి. మీడియాకు వాటిని పంపి చేతులు దులుపుకున్నాయి . అంతవరకూ బాగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కోర్టులు ఉన్నాయి.  బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. వీరు ఎవరు ఎక్కడా జగన్ లేఖ రాయడాన్నిఖండిస్తూ తీర్మానాలు చేసినట్టు పత్రికల్లో కనిపించలేదు. ఎందుకనో ? ఒక చోటా అర చోటా స్పందించారేమో కానీ పెద్ద ఎత్తున స్పందించలేదు. 

చీఫ్ జస్టిస్ రేసులో ఉన్న రమణ తెలుగు వారు కదా? ఆంధ్రాకు చెందినవారే కదా. కనీసం ఆయనకు మద్దతుగా కూడా ఎవరూ మాట్లాడినట్టు లేరే?  ఆంధ్రాలో జగన్ లేఖ రాయడం పై ఒకరిద్దరు ఖండించినట్టు సమాచారం ఉంది కానీ  ఎవరూ తీర్మానాలు చేసి సుప్రీం కు పంపినట్టు ఎక్కడా వార్తల్లో కనిపించలేదు. ఏపీ బార్ అసోసియేషన్ , తెలంగాణ బార్ అసోసియేషన్ కూడా ఎక్కడా మాట్లాడలేదు. వీరు మాట్లాడితే జరిగేదేమి లేదు కానీ అనుకూల, ప్రతికూల స్పందన లేదన్నది ఇక్కడ పాయింట్.  ఇక్కడి వాళ్లకు వాస్తవాలు తెలుసు కాబట్టి మాట్లాడం లేదు అనుకోవాలా ? అయినా మనకెందుకులే అనుకుని మౌనం గా ఉన్నారా ?  

మొత్తం మీద లాయర్ల ఖండనలు , మండనలు , పత్రికల రాతల వల్ల జరిగేదేమి లేదు. ఆ విషయం అందరికి తెలిసిందే.  జగన్ లేఖ  పై అసలు స్పందించాల్సింది సీజే .. ఆరోపణలకు కట్టుబడాల్సింది జగన్. ఆరోపణలను ఖండించాల్సింది సంబంధిత వ్యక్తులు.  

ఇక ఢిల్లీ న్యాయవాదుల సంఘాల  డిమాండ్ కూడా చిత్రం గా ఉంది.  వారు డిమాండ్ చేయగానే జగన్ ను సీఎం పదవి నుంచి పీకేస్తారా ? చట్టం చదివి వీరు డిమాండ్ చేస్తున్నారా ? లేక ఎవరో చెబితే తీర్మానాలు చేస్తున్నారా  ? కోర్టులు ఒక సీఎం ను తొలగించగలవా ? అది సాధ్యమేనా ? జగన్  క్రిమినల్ అన్నట్టు కూడా కొందరు మాట్లాడారు. కోర్టు తీర్పు ఇవ్వకముందే పొలిటికల్ లీడర్ల తరహాలో లాయర్లు మాట్లాడుతున్న తీరు విచిత్రంగా ఉంది. 

అదలా ఉంటే 

డిల్లీ  బార్ కౌన్సిల్ అధ్యక్షుడి ఆఫీసు పై, ఇంటి పై  ఐటీ దాడులు జరిగాయి. అధికారులు 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ లాయర్ మహాశయుడు క్లయింట్ నుండి 217 కోట్లు తీసుకుని లెక్కల్లో చూపింది 21 కోట్లు మాత్రమేనట . ఈ లాయర్ కి సంబందించిన బంధువులు , స్నేహితులు ,కార్యాలయాలలో కూడా దాడులు జరిగాయి. జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరిన లాయర్లలో ఈయన ముందంజ లో ఉన్నారు. ఐటీ దాడులు  కాకతాళీయమో కాదో కానీ ఇంకెవరు ఈ కేసుపై మాట్లాడే సాహసం చేయకపోవచ్చు. 

READ ALSO >>>> మోడీ క్యాబినెట్ లో చేరికపై జగన్ నిర్ణయం ఏమిటో ?

————-  KNMURTHY 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!