Danger ………………………………………………………………..
కొంతమంది స్మార్ట్ ఫోన్స్ ను అసలు వదలరు.బండిపై వెళ్తూ .. అన్నం తింటూ , బాత్రూమ్ కి వెళ్ళినపుడు కూడా ఫోన్లను వదలరు. 24 గంటలు చేతిలో ఉండాల్సిందే. ఇలా గాడ్జెట్‌ల తో ఎక్కువ సమయం గడిపితే కంటి చూపు మందగించవచ్చు . లేదా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చని గతంలో అనేక అధ్యయనాలు నొక్కిచెప్పాయి.
అయితే ఈ అలవాటు వృద్ధాప్య ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనం సూచిస్తుంది. వస్తువుల్ని ప్రేమిస్తున్న యువతీ యువకులు తొందరగా ముసలోళ్లు అవుతున్నారనే చెప్పే షాకింగ్ రిపోర్ట్ అది. ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్’ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా గాడ్జెట్ల నుండి వచ్చే అధిక నీలి కాంతి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని తెలుస్తోంది.
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్.. మనిషి జీవితంలో ఇపుడు ఒక భాగమైంది. అది లేకపోతే ఏదో కోల్పో యామనే భావన కలుగుతోంది. స్మార్ట్ ఫోన్ తో పాటు ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, ల్యాప్ ట్యాప్ తో పాటు ఇతర గాడ్జెట్స్ పై అదే అభిప్రాయం ఉంటే ప్రమాదమని సమాచారం.
ఎందుకంటే వాటివల్ల మానవళి మనుగడకు ముప్పు వాటిల్లుతున్నట్లు.. ముఖ్యంగా గాడ్జెట్స్ వల్ల వయస్సు మీద పడి అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నట్లు అమెరికాకు చెందిన ‘ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ’ చేసిన అధ్యయనంలో తేలింది.
స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యా ప్స్ తో పాటు ఇతర గాడ్జెట్స్ ను అతిగా వినియోగించడం వల్ల.. వాటి నుంచి వచ్చే నీలి రంగు వెలుతురు వల్ల త్వరగా యుక్త వయస్సు నుంచి వృద్ధాప్యంలోకి జారుకుంటున్నట్లు ఒరెగాన్ యూనివర్సిటీ ప్రతినిధులు అంటున్నారు.
ప్రతి రోజు టీవీ, ల్యాప్ ట్యాప్స్, స్మార్ట్ ఫోన్స్ వినియోగంతో మితిమీరిన కాంతి మనుషులు శరీరంపై పడుతుంది. తద్వారా శరీర కణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. చర్మం, కొవ్వు కణాల నుంచి నాడీకణాల వరకు దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కాబట్టి గాడ్జెట్ల వినియోగాన్ని కొంత తగ్గించడం మంచిదని వారు సూచిస్తున్నారు.