ముస్తాబు అవుతున్నహైడ్రోజన్ రైలు !!

Sharing is Caring...

 Hydrogen trains are good for the environment……………

హైడ్రోజన్ రైలు (Hydrogen Train) అనేది పర్యావరణానికి మేలు చేసే అత్యాధునిక రవాణా సాధనం. త్వరలో ఈ రైళ్లు ప్రయాణీకులకు సేవలు అందించనున్నాయి. ఈ రైళ్లు హైడ్రోజన్ ఇంధన కణాలను (Fuel Cells) ఉపయోగిస్తాయి.హైడ్రోజన్,ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

ఈ విద్యుత్తు రైలు మోటార్లను నడుపుతుంది.. ఈ ప్రక్రియలో వ్యర్థాలుగా కేవలం నీరు (Water)  నీటి ఆవిరి (Steam) మాత్రమే విడుదలవుతాయి. దీనివల్ల కాలుష్యం ఏర్పడదు.డీజిల్ రైళ్లతో పోలిస్తే ఇవి కార్బన్ ఉద్గారాలను సున్నాకి తగ్గిస్తాయి..

ఈ రైళ్లు నడిచేటప్పుడు చాలా తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి.ఒక్కసారి హైడ్రోజన్ నింపితే సుమారు 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి.భారత రైల్వే “హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్” (Hydrogen for Heritage) పథకం కింద హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెడుతోంది.

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ట్రయల్స్ హర్యానాలోని జింద్ – సోనిపట్ మార్గంలో ప్రారంభమయ్యాయి..డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే , కాల్కా-సిమ్లా వంటి హెరిటేజ్ రూట్లలో వీటిని నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జర్మనీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ హైడ్రోజన్ రైళ్లను వాణిజ్యపరంగా ప్రవేశ పెట్టింది. ఫ్రాన్స్, చైనా,జపాన్ వంటి దేశాలు కూడా ఈ సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి.ఇండియా తొలి హైడ్రోజన్ రైలు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభం కావచ్చు.

మొదటి రైలు హర్యానాలోని జింద్ – సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో నడుస్తుంది. ట్రయల్స్ విజయవంతమైన తర్వాత 2026 మధ్యలో లేదా చివరి నాటికి సామాన్య ప్రజలకు ఈ రైలు సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం జింద్‌లో హైడ్రోజన్ ప్లాంట్ పనులు,  రైలు తుది పరీక్షలు పూర్తి కావచ్చాయి. ఈ హైడ్రోజన్ రైలులో మొత్తం 8 ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. ఇది ఒకేసారి సుమారు 2,500 నుండి 2,638 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. కోచ్‌లు ఆధునిక మెట్రో రైళ్ల తరహాలో రూపొందించబడ్డాయి, వీటిలో ఆటోమేటిక్ డోర్లు, అత్యాధునిక ఏసీ సౌకర్యాలు ఉంటాయి.

అధికారికంగా ఇంకా ఖచ్చితమైన ధరలు ప్రకటించనప్పటికీ, ప్రారంభ అంచనాల ప్రకారం ఈ రైలు టికెట్ ధరలు ₹5 నుండి ₹25 మధ్య ఉండవచ్చు.సామాన్య ప్రయాణికులకు కూడా అందుబాటులో ఉండేలా భారత రైల్వే ఈ ధరలను నిర్ణయించే అవకాశం ఉంది.ఇతర సాధారణ లోకల్ రైళ్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ లేదా సమానమైన ధరకే అందుబాటులోకి రానున్నాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!