మాడా …… హలొ హలొ.
రావు ……… హలొ హలొ బహుకాల దర్శనం.
మాడా …… ఈ మధ్య బిగినెస్ ఏదీ తేవడం లేదని నసుగుతున్నారు కదా .. మంచి ఆఫర్ వచ్చింది.
రావు …… ఆఫరా ? చెప్పు చెప్పు .. అసలే పని లేక గోళ్లు గిల్లుకుంటున్నాం.
మాడా …… ఇపుడే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది..
రావు …… ఏంటి అమెరికా నుంచా ? ..కొంపతీసి ఆ గ్రింప్ కానీ చేయలేదు కదా .
మాడా ….. తమరు భలే కనిపెట్టేస్తారు మహా ప్రభో … కానీ చేసింది గ్రింప్ కాదు దిడేన్ దొరవారు.
రావు … ….. నువ్వు చెప్పేది నిజమేనా ?
మాడా … …అవును ప్రభూ.
రావు …….. అంటే మన ఖ్యాతి అమెరికా దాకా వెళ్లిందన్న మాట.
మాడా …. అమెరికా కే కాదు రష్యా కూ చేరింది ప్రభూ.
రావు …….. సర్లే కానీ అసలు పనేంటో చెప్పు మరి.
మాడా ….. చిన్న పనే … ఆ బుతిన్ ను పట్టుకుని కారులో తొంగో బెట్టి అమెరికాకు అప్పగించాలి .
రావు …….. ఓస్ అంతేనా ?
మాడా …… బుతిన్ అంటే మాటలు కాదు .. ఈ సంగతి తెలిస్తే అక్కడనుంచే బాంబులు వేస్తాడు ప్రభూ ..
రావు ……… బాంబులు చుట్టడంలో .. వేయడంలో మనం కూడా ఫేమస్ కదా .. ఇంకే ఆఫర్లు ఉన్నాయో చెప్పు
మాడా …… ఆ గ్రింప్ ను కూడా పట్టుకోవాలి .. బుతిన్ ను గ్రింప్ ను కలిపి అప్పగిస్తే ఎంత ?విడివిడిగా అప్పగిస్తే ఎంత ?
రావు ….. ….ఓస్ అంతే కదా ..
మాడా …….. అంతే కాదు ఇంకా ఉన్నాయి .
రావు ………. చెప్పు మరి.
మాడా …….. ఆ బుతిన్ కి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆమెను కూడా పట్టుకోవాలట. ఆమె ఒక్కతే కాదు ఆమె బాయ్ ఫ్రెండ్ ని కూడా పట్టుకోవాలి.
రావు ………… వాడు దేనికో ?
మాడా …… వాడు చీటికీ మాటికీ బాంబులు వేస్తానని బెదిరిస్తున్నాడట.
రావు …….. సర్లే కానీ నాకో సందేహం .. ఆ బుతిన్ ను పట్టుకుని అమెరికా ఏమి చేస్తుందట ?
మాడా …… నిజం చెప్పాలంటే .ఆ బుతిన్ ఎక్కడ బాంబులు ఏస్తాడో అని దిడెన్ కూడా వణికిపోతున్నాడట.ఇపుడు యుద్ధ నేరస్తుడిగా ఆయనను పట్టుకుని విచారిస్తారట.
రావు ….. ఓహో అదీ సంగతన్నమాట.
మాడా …… అన్నట్టు మనకు రష్యా నుంచి కూడా ఆఫర్ ఉంది ?
రావు …….. అక్కడినుంచా ?
మాడా …….. అవును దిడెన్ ను జిలెన్ స్కి ని కలిపి పట్టుకోవాలట ?
రావు ……. … అవును ఈ ఆఫర్ ఎవరిది ?
మాడా ……… ఇది బుతిన్ వంటాయనది.
రావు …….. .. మధ్యలో ఈ వంటవాడు ఏంటి ?
మాడా ……… వంట వాడని తేలికగా తీసేయవద్దు ప్రభూ. ఆయనే బుతిన్ కి సన్నిహితుడు.ఆయన ఏమి సెప్పినా కళ్ళు మూసుకుని ఒకే అంటాడు.
రావు …… అంత సీను ఉందన్న మాట … నాకో సందేహం .. ఇవన్నీ చేయడానికి వాళ్ళకి మనుష్యులు లేరా ?
మాడా ……. ఎందుకు లేరు ..అందరికి ప్రయివేట్ మిలటరీ సైన్యం ఉంది .. కానీ వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఉండాలని.
రావు ……… ప్రయివేట్ మిలిటరీ నా ? వాళ్ళేమి చేస్తారు.
మాడా ……. వాళ్ళు కూడా తమరి లాగానే పెజా సేవ చేస్తుంటారు.ఆర్డర్ ఇస్తే డిక్కీలో తొంగో పెడుతుంటారు.
రావు ……… అయితే వాళ్లంతా మన సోదరులే అన్నమాట. మన కాన్సెప్ట్ కాపీ కొడుతున్నారన్నమాట.
మాడా ……. సర్లే కానీ ఇపుడు చెప్పండి ఒక్కొకటి ఎంత ? గంపగుత్త గా ఎంత ? ఇందులో కన్సెషన్ ఎంత ? క్యాష్ కావాలా ? చెక్కు కావాలా ? లేక ఒక విమానం నిండా బాంబులు కావాలా ? మరి నాకెంత ఇస్తారు ?
రావు …….. విమానం నిండా బాంబులా ? వార్నీ ?? మనకు డీలర్ షిప్ ఇస్తాడేమో కనుక్కోమరి.
మాడా ……..సరే ప్రభూ .. ముందు రేటు.. నా కమీషన్ ఫిక్స్ చేయండి తమరు.
రావు ….. ….. సర్లేవోయ్ ..ఇంత పెద్ద ఆఫర్ తెస్తే ఎంతో కొంత ఇస్తాగా ? అయినా నాకు ఎందుకో డౌటేస్తుంది. అటు ఇటు పనిచేస్తున్నామని తెలిస్తే ఆ బుతిన్ మన మీద బాంబులు వేయడు కదా ?
ఆమాట అన్నాడో లేదో ఆ ఇద్దరిపై బాంబులు వచ్చి పడ్డాయి.. దడ దడ మంటూ పేలాయి. ఇద్దరు ఎగిరి కిలోమీటర్ దూరం లో పడ్డారు.
——KNM