He is the God of poor Muslims.
సలార్.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా అది. కానీ రియల్ గా హైదరాబాద్ లో ఓ సలార్ ఉన్నారు. . సలార్ అంటే అర్థం ఏమిటంటే … ఉర్దూలో నాయకుడు లేదా కమాండర్ ఇన్ఛీ ఫ్. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ నాయకుడిని సలార్‌గా పిలుచుకునే వారు. ఇంతకీ ఎవరా నాయకుడు.? అంటే .. ఈ తరానికి అంతగా తెలియని నాయకుడు.
హైదరాబాద్‌లోని మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ వాహెద్ ఒవైసీ కుమారుడే సలార్. ఆయన పేరు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడంతో సలావుద్దీన్‌కు చిన్ననాటి నుంచే రాజకీయాలు ఒంట పట్టాయి. ఎంతో మంది పేద మస్లింలకు అండగా నిలిచారు సలావుద్దీన్. దాదాపు 4 దశాబ్ధాల రాజకీయ జీవితంలో హైదరాబాద్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
పేద ప్రజలకు సలావుద్దీన్ చేసిన సేవలకు, వారికి అండగా నిలిచిన విధానానికి అప్పటి ప్రజలు.. ఆయనకు ‘సలార్ ఎ మిల్లత్’ అనే బిరుదును ఇచ్చారు.దీని అర్థం సమాజ కమాండర్ అని.. అనంతరం సలార్ అని పిలవడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ మజ్లీస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండడానికి కారణం .. సలావుద్దీన్ పనితీరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
MP అసదుద్దీన్ ఓవైసీ, MLA అక్బరుద్దీన్ ఓవైసీలు.. సలావుద్దీన్ కుమారులే. ఎన్నో ఏళ్లపాటు ప్రజా సేవ అందించిన సలావుద్దీన్.. 2008 సెప్టెంబర్ 29వ తేదీన తుది శ్వాస విడిచారు. సల్లావుద్దీన్ ఓవైసీ తండ్రి అబ్దుల్ వాహెద్ ఓవైసీ మజ్లీస్‌కు నాయకత్వం వహించేవారు. ఆయన 1976లో మరణించిన తర్వాత పార్టీ పగ్గాలను సల్లావుద్దీన్ ఓవైసీ తన చేతుల్లోకి తీసుకున్నారు. తన తండ్రి జైలులో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సుల్తాన్ సల్లావుద్దీన్ 2004లో తప్పుకుని తన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీకి మజ్లీస్ పగ్గాలు అప్పగించారు.
అయితే, ఓవైసీకి అమానుల్లా ఖాన్ నుంచి సవాల్ ఎదురైంది. ఆ సమయంలో తన చిన్నకుమారుడు అక్బరుద్దీన్ ఓవైసీని రంగంలోకి దింపి, అమానుల్లాఖాన్ ప్రాబల్యాన్ని తగ్గించగలిగారు. ఒకప్పుడు హైదరాబాద్ పాతబస్తీ రెండు మత పార్టీల రాజకీయాలకు వేదికగా ఉండేది. సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీని ఎదుర్కోవడానికి బిజెపికి చెందిన ఆలె నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. చాలా కాలం వారు సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీకి సవాల్ విసిరారు. సలార్ బీజీపీ రాజకీయాలను తిప్పికొడుతూ పార్టీని విజయపధంలో నడిపారు. సలా వుద్దీన్ కి దేశంలోని అన్ని పార్టీల నేతలతో మంచి పరిచయాలు ఉండేవి.. .ఆయనంటే అందరూ గౌరవించేవారు.