లేటు వయసులో విడాకులు !

Sharing is Caring...

మీడియా దిగ్గజం, బిలియనీర్‌ రూపర్ట్‌ మర్డోక్‌ 91 ఏళ్ళ వయసులో  నాలుగో భార్య జెర్రీ హాల్‌(66) నుంచి విడాకులు తీసుకున్నారు. జూన్ లోనే  ఈ జంట విడాకులకు సిద్ధమైనారు. వివాహం చేసుకున్న ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని మర్డోక్ న్యాయవాది జూడీ పోలర్ మీడియాకు వివరించారు.

మార్చి 2016లో లండన్‌లో నటి జెర్రీ హాల్ ని వివాహం చేసుకున్న ముర్డోక్‌కి ఇది నాలుగో పెళ్లి .. నాలుగో మారు విడాకులు తీసుకున్నారు.మర్డోక్‌ కుటుంబ సన్నిహితుల సమాచారం మేరకు ఈ దంపతులు విడిపోతున్నట్లు జూన్ లోనే వార్తలు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మర్డోక్‌ ఆస్తులు ఫోర్బ్స్‌ ప్రకారం సుమారు 1.38 లక్షల కోట్లు అని అంచనా. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో మర్డోక్  ప్రముఖ వార్తా సంస్థలను నిర్వహిస్తున్నారు. న్యూస్‌ కార్ప్, ఫాక్స్‌ కార్ప్‌ల్లో మర్డోక్‌ కు  40% వాటాలున్నాయి. న్యూయార్క్ పోస్ట్, ది టైమ్స్ ఆఫ్ లండన్, బ్రిటిష్ టాబ్లాయిడ్ ది సన్, ఫాక్స్ న్యూస్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు  మర్డోక్ వే.  

మర్డోక్‌ తన మొదటి భార్య, ఫ్లైట్‌ అటెండెంట్‌ పాట్రిసియా బుకర్ తో 1966లో విడిపోయారు. మర్డోక్ రెండవ భార్య అన్నా..  వార్తాపత్రిక రిపోర్టర్. 1999లో విడాకులు తీసుకునే ముందు 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వీరిద్దరు కలిసి ఉన్నారు.

వెండి డెంగ్‌తో అతని మూడవ వివాహం 2013లో జరిగింది.  ఆమె బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌తో ప్రేమాయణం సాగిస్తోందని మీడియాలో  వార్తలు రావడంతో ఆ బంధం ముగిసి పోయింది.మర్డోక్ కి  ఆరుగురు పిల్లలు ఉన్నారు.  వీరిలో చాలా మంది కుటుంబ వ్యాపారంలో పాలు పంచుకుంటున్నారు. వీరిలో ఇద్దరు వారసత్వ రేసులో ఉన్నారు.

ముర్డోక్  సెంచరీ ఫాక్స్‌ను 2019లో డిస్నీకి $71.3 బిలియన్లకు విక్రయించాడు , $12 బిలియన్ల నికర లాభం సంపాదించాడు. ఆ మొత్తాన్ని ఆ తర్వాత  తన ఆరుగురు పిల్లలకు సమానంగా పంచాడు. ఆయన ఇద్దరు కుమారులు, జేమ్స్, లచ్లాన్ వ్యాపార వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!