కొత్త టాక్స్ విధానంలో రాయితీ!

Sharing is Caring...

Rebate on Tax ………………………….

వ్యక్తిగత ఆదాయపు పన్ను (Income tax) విధానానికి సంబంధించి తాజా బడ్జెట్ లో కీలక మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డీఫాల్ట్ ఆప్షన్ గా ఉంటుంది.

పాత పన్ను విధానంలో ఉన్న వారు అందులో పొందుతున్న రాయితీలను మునుపటిలా పొందవచ్చు. టాక్స్ పేయర్లు కోరుకుంటే కొత్త పన్ను పరిధిలోకి రావచ్చు. కొత్త పన్ను విధానానికి సంబంధించి బడ్జెట్ లో చేసిన మార్పులు ఈ విధంగా ఉన్నాయి…

కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ ఇచ్చేవారు. కానీ ఈ సారి ఆ రిబేట్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.7లక్షలకు పెంచారు. రూ.7లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు.కొత్త ఆదాయ పన్ను విధానంలోని శ్లాబుల సంఖ్యను కూడా తగ్గించారు.

గతంలో ఆరు శ్లాబులు ఉ౦డగా.. వాటిని ఐదింటికి కుదించారు.@ రూ. 3 లక్షల వరకు ఎటువంటి పన్ను విధించరు. @ రూ.3-6 లక్షల వరకు 5 శాతం పన్ను విధిస్తారు.@ రూ. 6-9 లక్షల వరకు 10శాతం పన్ను చెల్లించాలి.@ రూ. 9-12 లక్షలకు 15శాతం, రూ.12-15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20శాతం పన్ను కట్టాలి.

@ కొత్త విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటిన వారిపై అత్యధికంగా 30శాతం పన్ను రేటు విధిస్తారు. ఉదాహరణకు ‘A ‘ అనే వ్యక్తి సంవత్సరంలో రూ. 7 లక్షల ఆదాయం పొందితే.. తొలి 3 లక్షలకు ఎలాంటి పన్ను ఉండదు. తర్వాత 4 లక్షలకు పై శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కానీ, ఈ సారి ఆ మొత్తంపై రిబేట్ ఇచ్చారు. దీంతో రూ. 7లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. వార్షికాదాయం రూ. 15 లక్షలు ఉంటే రూ.1.5లక్షల వరకు పన్ను చెల్లించాల్సి రావచ్చు. గతంలో ఇది రూ. 1.87 లక్షల వరకు ఉంది. అత్యధిక ఆదాయపన్నుపై సర్ ఛార్జ్ రేటును 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు.పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 52,500కు పెంచారు. మొత్తం మీద ఈ సారి పన్ను చెల్లింపు దారులపై కేంద్రం కరుణ చూపించింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!