సూర్యాస్తమయం లేని దేశాలు !

Sharing is Caring...

ప్రతి రోజూ సూర్యుడు ఉదయించి …. సాయంకాలం అస్తమించడం మనకు తెలుసు. చీకటి పడితే మనకు రాత్రి కింద లెక్క.  కానీ కొన్ని దేశాల్లో సూర్యాస్తమయం జరగదు. పగలు అలాగే కొనసాగుతుంది. అంటే రాత్రి ఉండదు. ఈ అద్భుత భౌగోళిక  విన్యాసానికి కారణం ఏంటంటే….  వేసవికాలంలో ఉత్తర ధృవం సూర్యుడి వైపు వంగి ఉంటుంది. అందుకే ఉత్తరార్ధ గోళంలో కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయం కాదు. అయితే ఇది పాక్షికమే. ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయా దేశాల కెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో ? ఆయా దేశాల గురించి తెలుసుకుందాం.

నార్వే………..  నార్వేను ‘ల్యాండ్ ఆఫ్ ది మిడ్నైట్ సన్’ అని పిలుస్తారు. మే నుండి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించడు ఇక్కడ. సూర్యుడు 76 రోజులు నిరంతరం ప్రకాశిస్తాడు. ఇక్కడ ఉత్తర భాగంలో వేసవిలో సూర్యుడు రెండు నెలలు రాత్రిళ్లు కూడా ప్రకాశిస్తాడు. సాయంత్రం సమయం లో కొద్దిగా చీకటి పడుతుంది.ఉత్తర నార్వే లో ద్వీపాలు .. సరస్సులను  పర్యాటకులు  ఎక్కువగా సందర్శిస్తుంటారు.

ఫిన్లాండ్ ……… ఫిన్లాండ్ పూర్తిగా 23 గంటల పాటు సూర్యుడు ప్రకాశించే దేశం. వేసవిలో 73 రోజులు రాత్రి లేని కొన్ని ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1,87,888 సరస్సులు ఉన్నాయి. అందుకే దీనిని సరస్సుల దేశం అని కూడా అంటారు. పర్యాటకులు ఎక్కువగా ఈ దేశాన్ని చూసేందుకు  వెళుతుంటారు.

అలాస్కా…………. అలాస్కాలోని అందమైన హిమానీ నదాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సూర్యకిరణాల తాకిడి తో  ఆ మంచు అందాలు మెరుస్తుంటాయి. మే నుండి జూలై వరకు ఇక్కడ సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ మధ్యాహ్నం 12.30 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది. వెంటనే  … 51 నిమిషాల తర్వాత మళ్లీ సూర్యోదయం కనిపిస్తుంది.

ఐస్‌ల్యాండ్…….. గ్రేట్ బ్రిటన్ తర్వాత ఐరోపాలో ఐస్లాండ్ అతిపెద్ద ద్వీపం. ఇక్కడ అర్ధరాత్రి కూడా సూర్యకాంతిని ఆస్వాదించవచ్చు. ఈ ద్వీపం నాలుగు పక్కలా నీరు ఉంటుంది.  ఇది ఎంతో అందమైన దేశం ..ఇక్కడ కూడా సూర్యుడు మే నుంచి జూన్ వరకు అస్తమించడు.  నిరంతరం ప్రకాశిస్తుంటాడు. ఈ అద్భుతాన్ని అక్కడ కెళ్ళి చూడాల్సిందే. 

కెనడా……… ప్రపంచంలో విస్తీర్ణంలో రెండవ స్థానంలో ఉంది. కెనడా సంవత్సరంలో ఎక్కువ భాగం మంచు ముసుగులో ఉంటుంది. వేసవి రోజులలో కూడా  ఇక్కడ రాత్రిని చూడలేం . ..  ఎందుకంటే వేసవిలో చాలా రోజులు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తాడు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!