IRCTC Coastal Karnataka Tour Package…..
‘కోస్టల్ కర్ణాటక’ పేరిట IRCTC స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి ఈయాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి,మంగళూరు వంటి అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించవచ్చు.
5 రోజులు /6రాత్రుల పాటు ఈ యాత్ర సాగుతుంది.ఈ కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం 11 మార్చి 2025 వ తేదీన అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే మార్చి 18, 25వ తేదీలలో వెళ్ళవచ్చు.
DAY.. 1…. కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు యాత్ర మొదలవుతుంది. పగలు, రాత్రి అంతా జర్నీ ఉంటుంది.
DAY.. 2... ఉదయం 9. 30 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి బస్ లో ఉడిపి కి వెళ్తారు.హోటల్ లో చెక్ ఇన్ అవుతారు. సమీపంలోని శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpe బీచ్ ను చూస్తారు. ఆ రాత్రి హోటల్ లో బస చేస్తారు.
DAY..3.. ఉదయం కొల్లూరుకు వెళతారు. మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళతారు. అక్కడ ఆలయాన్ని, శివుని విగ్రహాన్ని సందర్శిస్తారు. సాయంత్రం గోకర్ణకు చేరతారు. అక్కడ బీచ్ ను చూస్తారు. రాత్రి కి మళ్లీ ఉడిపికి చేరుకొని అక్కడే బస చేస్తారు.
DAY..4…. హోటల్ చెక్ అవుట్ చేసి హార్నాడు కు చేరుకుంటారు. అక్కడ అన్నపూర్ణ ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం శృంగేరికి వెళ్లి శారదాంబా ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి మంగళూరు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
DAY.. 5… హోటల్ చెక్ అవుట్ చేస్తారు. మంగళూరు లో మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, గోకర్నాథ్ ఆలయాన్ని చూస్తారు.రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 8.05 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
DAY..6 … మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో యాత్ర ముగుస్తుంది.
కోస్టల్ కర్ణాటక ప్యాకేజి ధరలు…
Comfort (3A) లో సింగిల్ షేరింగ్ కు రూ.39,140 … డబుల్ షేరింగ్ కు రూ. 22,710… ట్రిపుల్ షేరింగ్ కు రూ.18,180గా నిర్ణయించారు.
Standard (SL) లో సింగిల్ షేరింగ్ కు రూ. 36,120 ….. డబుల్ షేరింగ్ కు రూ.19,690, ట్రిపుల్ షేరింగ్ కు .15150 గా నిర్ణయించారు. పిల్లలకు వేరే ధరలు ఉన్నాయి.
టూర్ ప్యాకేజీలో 3రోజులు అల్పాహారం.. 3 రాత్రులు వసతి. లోకల్ రవాణా, ప్రయాణ బీమా సదుపాయం ఉంటాయి .. లంచ్,డిన్నర్ ఖర్చులు, ఇతర ఖర్చులు ప్రయాణీకులు భరించాలి. ఏమైనా సందేహాలు లేదా వివరాలను తెలుసుకోవాలంటే.. IRCTC –Mob: 8287932229 / 9701360701 లకు ఫోన్ చేసి కనుకోవచ్చు.