చౌక ధరలోనే థాయిలాండ్ ఫ్లైట్ ట్రిప్ !!

Sharing is Caring...

IRCTC Thailand Tour package …………………

జీవితంలో ఒకసారైనా థాయిలాండ్ చూసి రావాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. టూరిస్ట్ స్పాట్స్ లో నంబర్ వన్ ప్లేస్ లో థాయిలాండ్ ఉంటుంది. IRCTC “ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్” పేరిట ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది.

టూర్ నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు సాగుతుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ మొదలవుతుంది. థాయిలాండ్ లో ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలైన పట్టయ, బ్యాంకాక్ లో పలు ప్రదేశాలను టూర్ లో చూడవచ్చు. 

DAY..1…. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి తెల్లవారుజామున 4 గంటల సమయంలో బ్యాంకాక్ కు ఫ్లైట్ జర్నీమొదలవుతుంది. ఉదయం 10 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ లాంఛనాలు పూర్తి చేసి లగేజ్ తీసుకుని అక్కడి నుంచి పట్టయకు బయలుదేరుతారు.

దారిలో బ్రేక్ ఫాస్ట్ చేసి టైగర్ జూ ని విజిట్ చేస్తారు. ఆ తర్వాత హోటల్లో చెకిన్ అవుతారు. లంచ్ చేసి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుంటారు.ఈవెనింగ్ జెమ్స్ గ్యాలరీ, అల్కజార్ షోను వీక్షించి ఆ రాత్రికి ఇండియన్ రెస్టారెంట్ లో డిన్నర్ చేసి పట్టయ హోటల్ లోనే బస చేస్తారు.

DAY..2.. బ్రేక్ ఫాస్ట్ తర్వాత కోరల్ ద్వీపంలో స్పీడ్ బోటింగ్ ఉంటుంది.ఇండియన్ లంచ్ చేస్తారు.అక్కడే బీచ్లో కాసేపు సేదదీరుతారు. సాయంత్రం నూంగ్ నుచ్ ట్రోపికల్ గార్డెన్ చూసి పట్టయకు తిరిగి వస్తారు. ఆ రాత్రికి ఇండియన్ రెస్టారెంట్ లో డిన్నర్ చేసి హోటల్ కి చేరుకుంటారు .DAY..3…. బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. సఫారీ వరల్డ్ టూర్ వరల్డ్ అండ్ మెరైన్ పార్క్ విజిట్ చేస్తారు. సాయంత్రానికి బ్యాంకాక్ కి చేరుకుంటారు. స్థానికంగా ఉన్న ముఖ్యమైన ప్రాంతాలను చూస్తారు. ఆ రాత్రి బ్యాంకాక్ లోనే బస చేస్తారు. .

DAY..4…. బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. లంచ్ అయ్యాక గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధను సందర్శిస్తారు. సాయంత్రం ఇంద్ర మార్కెట్లో షాపింగ్ చేసుకుంటారు. ఆ రాత్రి బ్యాంకాక్ లో బస చేస్తారు.

DAY .. 5… ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. ఫార్మాలిటీస్ అనంతరం 10.25 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి.

సింగిల్ షేరింగ్ రూ.56,370, డబుల్ షేరింగ్ రూ.49,320, ట్రిపుల్ షేరింగ్ రూ.49,210 పే చేయాలి.

చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.46,710, విత్ అవుట్ బెడ్ అయితే రూ.40,450 చెల్లించాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే….

ఫ్లైట్ టికెట్లు (హైదరాబాద్ – బ్యాంకాక్ – హైదరాబాద్)త్రి స్టార్ హోటల్ అకామిడేషన్, 5 బ్రేక్ ఫాస్ట్, 4 లంచ్, 3 డిన్నర్,విజిట్ చేసే ప్రదేశాల ఎంట్రీ టికెట్లుట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రస్తుతం ఈ టూర్ జులై 23వ తేదీన అందుబాటులో ఉంది.తప్పని సరిగా పాస్ పోర్ట్ ఉండాలి.  

ఈ ప్యాకేజీ సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!