ఈ దశలో షేర్లను కొనుగోలు చేయవచ్చా ?

Sharing is Caring...

The market could fall anytime…………… దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో  మార్కెట్ ఉరకలేస్తోంది. స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్టాలకు చేరుకుంటున్నాయి. గత వారాంతంలో సెన్సెక్స్ ఒకదశలో 341 పాయింట్లు పెరిగి చివరికి 174. 29 పాయింట్ల లాభంతో 52. 641.53 పాయింట్ల వద్ద ఆగింది. నిఫ్టీ కూడా 61. 60 పాయింట్లు మేరకు పెరిగింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 374 పాయింట్లు .. నిఫ్టీ 129 పాయింట్ల వరకు పెరిగాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 231 లక్షల కోట్లు దాటింది. విదేశీ ఇన్వెస్టర్లు జూన్ 1 నుంచి ఇప్పటి వరకు  రూ. 13,424 కోట్ల మేరకు కొనుగోళ్లు చేశారు. సెంటిమెంట్ సానుకూలంగా ఉండటంతో వారి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్ పెద్ద ఇన్వెస్టర్లకు .. విదేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే అనుకూలం. మార్కెట్ ఉరకలేస్తున్నప్పటికీ కొద్దీ రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కు దిగే అవకాశాలు లేకపోలేదు. అదే కానీ జరిగితే మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ లో పడవచ్చు.వరుసగా మార్కెట్ పెరగడం కూడా ఎప్పుడూ మంచిది కాదు. ప్రస్తుత ప్రతికూల పరిణామాలను  ఇన్వెస్టర్లు పట్టించుకోవడంలేదు. కాబట్టి మార్కెట్లు దూసుకు పోతున్నాయి. అయితే ఈ అప్ ట్రెండ్ ఎంత కాలమనేది చెప్పలేము. కొత్త రికార్డులు నెలకొల్పుతున్న మార్కెట్  ఏరోజు అయినా దిద్దుబాటు కి గురవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వల్పకాలానికి ఈ ధోరణి కొనసాగొచ్చు.

ఇలాంటి పరిస్థితిలో ఏదో ఒక దశలో అమ్మకాలు వెల్లువెత్తవచ్చు.విదేశీ ఇన్వెస్టర్ల మనసు మారడానికి ఒక చిన్నఘటన చాలు. గతంలోనూ ఇలాంటి అనుభవాలు మార్కెట్ కి ఉన్నాయి .కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది  సెన్సెక్స్ కుప్పకూలి 25,900 పాయింట్లకు పడిపోయింది.కేవలం ఏడాది వ్యవధిలో రెట్టింపు అయ్యింది. నిఫ్టీ కూడా మార్చి 2020 లో 7610 కి పడిపోయింది. అది కూడా కేవలం ఒక సంవత్సరంలోనే రెట్టింపు అయ్యింది. నిజంగానే అభివృద్ధి కారణంగా మార్కెట్ పెరిగిందా ? అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.  కరోనా సెకండ్ వేవ్ భీకరంగా ఉన్నప్పటికీ ఇండెక్స్ లు పెరుగుతున్నాయి. ఏ ప్రాతిపదికన ఈ సూచీలు పెరుగుతున్నాయి.  ద్రవ్యోల్బణ రేటు పెరుగుతోంది. జిడిపి వృద్ధి ఆకట్టుకునేలా లేదు. నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది.ఇన్ని ప్రతికూల కారణాలు ఉన్నప్పటికీ మార్కెట్ పెరుగుతుందంటే … అటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు .. దేశీయంగా కొత్త ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకోవడమే కారణం. ఇటీవల కాలంలో డీమ్యాట్ ఖాతాలు అనూహ్యంగా పెరిగాయని వార్తలు వచ్చాయి. గత రెండు మూడు నెలల్లో 12 లక్షలకు పైగా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లోకి వచ్చారు.

ఈ దశలో కొనుగోళ్లు పూర్తిగా రిస్క్ తో కూడినవే.కాబట్టి రిస్క్ తీసుకునే సత్తా వుంటే కొనుగోళ్లు చేయవచ్చు. ఇక ఈ స్థాయి కి చేరుకోవడం కూడా చిన్న ఇన్వెస్టర్లకు ఒక  విధంగా మంచిదే. లాభాలకు ఇదొక అవకాశం అన్నమాట. ఈ ట్రెండ్ ని ఇన్వెస్టర్లు లాభాల ఆర్జనకు అనువుగా ఉపయోగించుకోవాలి.డౌన్ ట్రెండ్లో షేర్లను కొనుగోళ్ళు చేసిన ఇన్వెస్టర్లు ,అంతకు ముందే షేర్లు కొనుగోలు చేసి అదను కోసం ఎదురు చూస్తోన్న ఇన్వెస్టర్లు  ప్రస్తుత తరుణం లో షేర్లను అమ్మేసుకొని లాభాలు  స్వీకరించడం మంచిది. ప్రస్తుత  అప్ ట్రెండ్ ఎంత కాలం సాగుతుందో గ్యారంటీ లేదు కాబట్టి ఇన్వెస్టర్లు ఈసమయంలో వ్యూహాత్మకం గా వ్యవహరించాలి. ఇంకా మార్కెట్  పెరుగుతుందని మరీ ఆశ పడకుండా  పాక్షికంగా నైనా అమ్మకాలు సాగించి స్వల్ప లాభాలతో సంతృప్తి పడటం మేలు. 

————–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!