New frendships…………………….
అద్దెకు బాయ్ ఫ్రెండ్ సర్వీసులు అందుబాటులో కొచ్చాయి. ప్రస్తుతం బెంగళూరుకు,మరికొన్ని నగరాలకు పరిమితం. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకుని గంటకు ఇంతని ఫీజు చెల్లిస్తూ బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడవచ్చు. ఇదో కొత్త ఒరవడి. Toy boy అనే యాప్ ఈ సౌలభ్యం కల్పిస్తోంది.
బెంగళూరు కి చెందిన ఒక కంపెనీ ఈ సర్వీసులను మొదలు పెట్టింది. లవ్ బ్రేకప్ అయిన గర్ల్స్ ను మానసిక వేదన నుంచి కాపాడటమే తమ ఉద్దేశ్యమని కంపెనీ చెబుతున్నప్పటికీ ఈ యాప్ స్నేహాలు పెడదారి పట్టే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి యాప్ ఆ మధ్య ముంబయి,పూణే నగరాల్లో ప్రవేశ పెట్టారు. దాని పేరు రెంట్ ఏ బాయ్. యువత ఎగబడ్డారు.
ఈ యాప్స్ అన్ని డేటింగ్ యాప్స్ కి మరో రూపమే అనే విమర్శలు లేకోపోలేదు. “ప్రియుడు వంచించాడనో, లేదా ప్రేమ విఫలమైందనో, ప్రేమ దక్కలేదనో మానసికంగా కుంగిపోయిన వారికి బాయ్ ఫ్రెండ్ ను అద్దెకు ఇచ్చేందుకు గంటల లెక్కన బాయ్ ఫ్రెండ్ ను అద్దెకిస్తామని కంపెనీలు చెబుతాయి.
అయితే “బాయ్ ఫ్రెండ్” ఎవరి దగ్గరికీ భౌతికంగా రాడు. కలిసే అవకాశం లేదు. ఫోన్ ద్వారా అమ్మాయిల సమస్యలను పూర్తిగా విని మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తాడని కంపెనీలు పైకి అంటాయి. బాయ్ ఫ్రెండ్ ను అద్దెకు తీసుకున్న వారు వాళ్లతో కలిసి షాపింగ్, రెస్టారెంట్లు, పార్కులకు వెళ్లడం, సెక్స్ లో పాల్గొనడం నిషిద్ధం అని నిబంధనలు కూడా పెడతాయి. కానీ బాయ్ ఫ్రెండ్స్/గర్ల్ ఫ్రెండ్స్ వేరే ఆలోచన చేస్తే అడ్దకునే వారు ఉండరు. రహస్యంగా ఏదైనా చేయవచ్చు.
బాయ్ ఫ్రెండ్ కేవలం ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాడు . యూజర్లు తమ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఈ సేవలుపొందొచ్చు. దీనికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.” అని కంపెనీలు పైకి అంటున్నప్పటికీ ఫోన్ ద్వారా మాట్లాడుకునే వ్యక్తులు మరింత చొరవ తీసుకోవచ్చు.
నిబంధనలు అతిక్రమించవచ్చు. అప్పుడు ఈ కొత్త స్నేహం పెడదారి పెట్టడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పలు దేశాల్లో ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక బాయ్ ఫ్రెండ్స్ గా పనిచేసేవారికి గంటకు 3 వేలు చెల్లించాలి. అందులో 40 శాతం కంపెనీ తీసుకుంటుంది.
ఖరీదైన ఈ స్నేహాలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. త్వరలో ఈ యాప్స్ తెలుగు రాష్ట్రాలకు రావచ్చు . బాగా డబ్బులున్న అమ్మాయిలు ఈ యాప్స్ ద్వారా కొత్త స్నేహాలు మొదలు పెట్టవచ్చు. విశృంఖల ధోరణి ఉన్నవారు ఈ యాప్ సేవలు పొందడం వల్ల పరిణామాలు తీవ్రంగా కూడా ఉండొచ్చు.