గ్రహాంతర వాసులే  దేవుళ్ళా ? (1)

Sharing is Caring...

Who are our gods?…………………………………….

దేవుళ్ళు దేవతలు ఎవరు? మనల్ని ఈ భూమ్మీద సృష్టించింది వాళ్లేనా? నిజంగా మన సృష్టి కర్తలు దేవుళ్ళు దేవతలే అయితే… వాళ్ళు  ఎలా ఉంటారు? వాళ్ల ఉనికి ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ ఎవరికీ అర్థం కాని ఓ పే..ద్ద బ్రహ్మపదార్థం లాంటివి… అన్ని దేశాల్లో అన్ని మతాల్లో రోజూ ఎక్కడో ఓ చోట.. ఏదో రకంగా జరుగుతున్న చర్చ ఇదే.

మిగతా మతాల మాటెలా ఉన్నా.. మన దేవతల తీరే వేరు.. అనేక రకాల రూపాలు.. అర్థం కాని వాహనాలు.. అసాధారణమైన ఆయుధాలు.. అపూర్వమైన శక్తియుక్తులు.. చిత్ర విచిత్రమైన  కథనాలతో కనిపిస్తారు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముక్కోటి మంది దేవతలు ఉన్నారని అంటారు. వీళ్లంతా ఎక్కడ ఉన్నారు? అసలు ఈ మాటల్లో , పురాణాల్లో, కథనాల్లో వాస్తవం ఉందా? ఉంటే అదేమిటి?

భూమ్మీద మనిషి జీవితం మొదలైనప్పటి నుంచీ దేవుళ్ళ  గురించిన వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి చాలా యుగాల క్రితమే మన పురాణాల్లో గ్రహాంతరాలల్లో వేరే లోకాలు ఉన్నాయని, అందులో జీవులు ఉంటున్నారన్న ప్రస్తావన ఉంది.. వారి గురించి పరిశోధన చేసినట్లూ, వారితో మనుషులు కలిసినట్లూ ఉంది… వాళ్లందరూ మనకన్నా చాలా రెట్లు శక్తివంతులు.వాళ్ల అనుగ్రహం మనపై ఉంటే మనకు అంతా మంచి జరుగుతుందని భావిస్తూ వస్తున్నాం…. వీళ్లే దేవతలా? దేవుళ్ళా ?
————————————
భూమి… లేదా భూగోళం.. ఇంకా చెప్పాలంటే భూలోకం. మనం ఉంటున్న లోకం ఇది.. ఈ లోకానికి కింది భాగాన ఏడు లోకాలు.. పై భాగాన మరో ఆరు లోకాలు ఉన్నట్లు మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి..భూమికి దిగువన అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు ఉంటే, ఎగువన భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఉన్నాయని భావిస్తున్నాం.

పై లోకాల్లో యక్ష, రాక్షస, గరుడ, గంధర్వ, కింపురుష, విద్యాధర, మహర్షి గణం ఉన్నదని, సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడని చెప్తారు.. బ్రహ్మ దేవుడి పైన క్షీరసాగరం, వైకుంఠం, కైలాసాదులు ఉన్నాయంటారు..భూమ్మీద తపస్సు చేసిన వారికి దేవతలు ఆకాశం నుంచి ప్రత్యక్షమవుతారు.. కోరిన వరాలిచ్చి ఆదుకుంటారు.. గంధర్వులు, దేవ కన్యలు దివి నుంచి భువికి దిగివస్తారు.

వీళ్లను మనం పూజిస్తున్నాం.. ఆలయాలను నిర్మించి ఆరాధనలు చేస్తున్నాం.. హోమాలు చేస్తున్నాం.. వీళ్లు  మనల్ని  అనుగ్రహిస్తున్నారని విశ్వసిస్తున్నాం.. అయితే వీరంతా ఎక్కడి నుంచి మనల్ని చూస్తున్నారు.. ఎలా అనుగ్రహిస్తున్నారు.. ? బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉంటాడు.. అక్కడి నుంచి ఆయన ఈ భూమ్మీద జీవులను సృష్టిస్తుంటాడు.. వాళ్లను పరిపాలించే బాధ్యత.. ఆ బ్రహ్మపైన ఉన్న విష్ణుమూర్తిది.. ఆయన వైకుంఠంలో పాల సముద్రంలో లక్ష్మీదేవి చెంతన ఉంటాడు.

అందరి జీవితాలు ముగిసిపోయిన తరువాత తనలో లయం చేసుకునే దేవుడు పరమ శివుడు.. ఆయన కైలాసంలో ఉంటాడు..అదొక వెండి కొండ… స్వర్గం, నరకం ఇవన్నీ భూమికి ఎగువన ఉన్నాయంటున్న అనేక లోకాలు.. ఈ లోకాల్లో ఈ దేవుళ్ళ  దేవతల ఆవాసం నిజమేనా? అక్కడి నుంచే భూమిని వీరు పరిపాలిస్తున్నారా?

courtesy….unknown writer

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!