గ్రహాంతరవాసులు ఉరఫ్ ఏలియన్స్ నిజంగా ఉన్నారా ? ఫ్లయింగ్ సాసర్ల లాంటి ఏలియన్ స్పేస్‌షిప్ లు కూడా ఉన్నాయా ? ఏలియన్స్ మానవకాంత లతో శృంగారం చేస్తున్నారా ? ఫలితంగా ఒక మహిళ గర్భం దాల్చిందా ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పుకోవాలి. ఈ అంశాలపై అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ కూడా కళ్ళు బైర్లు కమ్మే రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి.
ఏలియన్స్ దగ్గరకు వెళితేనే ఆరోగ్య సమస్యలు వచ్చాయని అదే రిపోర్ట్ చెబుతోంది. అలాంటి పరిస్థితుల్లో గర్భం ఎలా వచ్చిందో ?ఆ మిస్టరీ ఏమిటో తేలాల్సి ఉంది. ఇవన్నీ చూస్తుంటే కట్టు కథల్లా ఉన్నాయి. నమ్మబుద్ధి కావడం లేదు.
ఇక అసలు కథ లోకి వెళితే ……. ఈ విశ్వంలో ఎక్కడో ఒకచోట మనలాంటి బుద్ధిజీవులు.. మనకన్నా తెలివైన జీవులు ఉండొచ్చనే అంచనాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఒకవేళ వాళ్లు మనకన్నా తెలివైనవాళ్లు, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు అయితే మానవజాతి మనుగడకే ముప్పు అని ప్రచారం కూడా ఉంది. కొందరు పైలట్లు తాము విమానం నడుపుతున్నప్పుడు u f o లను చూసినట్టు చెప్పారు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తాము ఏలియన్లను, వారి స్పేస్‌షి్‌ప్సను చూశామన్నారు. కొన్ని ఏళ్ళ నుంచి ఇలాంటి కథనాలను విన్నాం. చదివాము. ఎందరితోనో చర్చించాం. ఇవన్నీ నిజమో కాదో మనకు తెలీదు. నిజమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ట్రాష్ అని కొట్టేసిన వారు ఉన్నారు. అయినప్పటికీ ఇలాంటి వార్తలు ఇంకా చలామణిలో ఉన్నాయి.
ఇలాంటి వార్తల నేపథ్యంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. అడ్వాన్స్‌డ్ ఏవియేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ పేరిట 2007 నుంచి 2012 దాకా ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని మించిన సాంకేతిక పరిజ్ఞానంతో రోదసి నుంచి ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉందేమో అంచనా వేయడమే.
డీఐఏ మాజీ చీఫ్ లూయిస్ ఎలిజోండో 2017లో ఈ ప్రాజెక్టు గురించి ఒక సందర్భంగా నోరుజారారు. దీంతో ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలివ్వాలంటూ సన్ పత్రిక ‘ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్’ కింద డీఐఏని కోరింది. తొలుత వివరాలిచ్చేందుకు డీఐఏ నిరాకరించింది. అయితే ఎట్టకేలకు నాలుగేళ్ల పోరాటం తర్వాత ఇటీవలే సుమారు 1500 పేజీలకు పైగా ఉన్న రిపోర్ట్ సమర్పించింది.
గ్రహాంతరవాసుల ఉనికిని అందులో డీ ఐ ఏ నిర్ధారించింది. అంతేకాదు ఆశ్చర్య పోయే అంశాలను కూడా డీఐఏ చెబుతోంది. గ్రహాంతరవాసులు మానవులతో శృంగారం జరిపిన ఘటనలు ఐదు నమోదయ్యాయని, ఒక మహిళ గర్భం దాల్చినట్టు సాక్షులు కూడా ఉన్నారని డీఐఏ వెల్లడించింది.
డిఐఏ లిఖితపూర్వకంగా ఇచ్చిన నివేదికలో మైండ్ బ్లో అయ్యే అంశాలున్నాయి.
గ్రహాంతరవాసుల నౌకలకు సమీపంగా వెళ్లిన విమానాల్లోని పైలట్లు రేడియేషన్‌కు గురయ్యారు. మరికొందరు మెదడు సమస్యలు, నాడులు దెబ్బతిని పక్షవాతం వంటి ఇబ్బందులకు గురయ్యారు. ఏలియన్స్ వల్ల ఆరోగ్య సమస్యలకు గురైన 42 కేసు లు వైద్యరికార్డుల్లో నమోదయ్యాయి. రికార్డుల్లో నమోదు కాని ఘటనలు దాదాపు 300 వరకు ఉన్నాయి. ఏలియన్స్ ప్రభావం వల్ల కొంతమంది కాలం స్థంభించి న భావనకు గురయ్యారు.
ఏలియన్లు మానవులను అపహరించిన ఘటనలు 129 నమోదయ్యాయి. వారి వ్యోమనౌకల వల్ల మానవుల వాహనాలు విద్యుదయస్కాంత ప్రభావానికి గురైన ఘటనలు 77 నమోదయ్యాయి. కాలాన్ని నష్టపోయామని 75 మంది చెప్పగా, 41 మందికి ఏలియన్స్ వల్ల కాలిన గాయాలయ్యాయి. 23 మంది కరెంట్‌షాక్‌కు గురయ్యారు.
కాలాన్ని నష్టపోవడమంటే.. ufo లకు దగ్గరగా వెళ్లిన విమానాల్లోని పైలట్లకు 5 నిమిషాలు గడిచినట్లు అనిపించింది. కానీ తర్వాత గడియారం చూసుకుంటే అరగంట గడిచిపోయింది. డి ఐఎ ప్రాజెక్టులో భాగంగా గ్రహాంతరవాసుల గురించే కాక.. దెయ్యాలు, భూతాలకు సంబంధించిన ఘటనలు, వాటి వల్ల గాయపడిన, మరణించిన ఉదంతాలను కూడా డీఐఏ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ నివేదిక లో నిజాలెన్ని ఉన్నాయో శాస్త్రజ్ఞులే నిగ్గు తేల్చాలి. రాబోయే రోజుల్లో నిజాలు బయట పడవచ్చు.