Sankeertan ….. There are powerful scenes but no powerful dialogues
2011-12 తర్వాత తెలుగులో సినిమాలు రాలేదా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారు కదా? అవును మీరు కరెక్టుగానే విన్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత 2011-12 తర్వాత తెలుగులో సినిమాలు రాలేదా? మనం చూడలేదా? అన్న అనుమానం కలుగుతుంది. 2011-12 తర్వాత బ్లాక్ బాస్టర్ సినిమాలు చాలానే వచ్చాయి.
అంతెందుకు ఆస్కార్ అవార్డులు అందుకుని ప్రపంచాన్ని అలరించాయి. కాని 2011లో వచ్చిన మిరపకాయ్, 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ తర్వాత ప్రేక్షకులకు ఇప్పడే సినిమా చూపిస్తున్నామన్నట్లు సాగాయి మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లు. ప్రమోషన్లు ఆ రేంజ్ లో చేశారు సరే. సినిమా ఏ రేంజ్ లో ఉందో ఓ లుక్ వేద్దామా?
మిస్టర్ బచ్చన్… రొటీన్ రొట్టకొట్టుడు సినిమా. మిరపకాయ్ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్, ఇక్కడ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంతే తేడా. అజయ్ దేవగన్ రైడ్ సినిమాను రీరైట్ చేసి రీమేక్ చేసే క్రమంలో… మిరపకాయ్ ను మరోసారి రీ షూట్ చేసినట్లు ఉంది.
ఈ రోజుల్లో పెళ్లిళ్లలో ఆర్కెస్టా పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో.. సినిమాలో కొన్ని పాత పాటలు వింటున్నప్పుడు అంతే దరిద్రంగా అనిపిస్తుంది. ఆ పాత పాటలు కనీసం తెలుగు పాటలైన బాగుండేదేమో. హిందీ పాటలు పెట్టి.. జనాలకు నిరుత్సాహం తెప్పించేశారు. ఆ పాత పాటలు వస్తున్నంత సేపు… ఈ నస ఏంట్రా బాబు అని అనిపిస్తుంది.
స్టోరీ ఎంత వరకు ఉందో అంత వరకు బాగానే నటించారు రవితేజ. కాని పవర్ ఫుల్ సీన్లు వచ్చినప్పుడు పవర్ ఫుల్ డైలాగ్స్ పడలేదు. చెప్పాలంటే పసలేని డైలాగ్స్. ఏదో ఒకటి అర తప్ప..There are powerful scenes but no powerful dialoguesమాస్ మహారాజ రవితేజ హీరోయిజానికి తగ్గట్లు మాస్ ఎలివేషన్లు ఈ సినిమాలో మిస్ అయ్యాయనే చెప్పాలి.
1980-90లో ఓ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రవితేజ, లోకల్ లో పవన్ ఫుల్ పొలిటిషియన్ జగపతిబాబు, రవితేజ నాన్న తనికెళ్ల భరణి ఆయనకు అమితా బచ్చన్ అంటే పిచ్చి, అమితాబ్ నటించిన షోలే సినిమా అంటే ప్రాణం. అందుకే రవితేజకు మిస్టర్ బచ్చన్ అని పేరు పెట్టాడు. అంతే సింపుల్ స్టోరీ.
ఓ హీరో, ఓ విలన్, ఫస్ట్ ఆఫ్ లో నాలుగు ఫైట్లు… సెకెండ్ ఆఫ్ లో నాలుగు ఫైట్లు. పిచ్చి పిచ్చి పాటలు ఇది మొత్తంగా మిస్టర్ బచ్చన్ సినిమా. మిరపకాయ్ లా ఎందుకు ఉందో చెప్పాలంటే.. మిరపకాయ్ లో రవితేజ ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అనండి అబ్బ అని.. ఆ డైలాగ్ ఇప్పటికీ మీమ్స్ లో మనం చూస్తుంటాం. మిరపకాయ్ లో బాగా పేలింది అనుకున్నారో ఏమో కాని… ఆ డైలాగ్ ఈ సినిమాలో పెట్టాశారు మన డైరెక్టర్. ఇక కామెడీ కూడా కొంత మిరపకాయ్ సినిమాలో నుంచి ఎత్తుకొచ్చారు.
రవితేజకు కొంచెం హైప్ ఇచ్చే అంశం ఏదైనా ఈ సినిమాలో ఉందీ అంటే.. అది బ్యాగ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. మంచి థియేటర్ లో సినిమా చూస్తే.. బ్యాగ్రౌండ్ స్కోర్ ను కొంత వరకు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. మిక్కీ జే మేయర్ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇక మెయిన్ క్యారెక్టర్లు జగపతిబాబు,తనికెళ్ల భరణి తమకు ఇచ్చిన పాత్ర మేరకు నటించారు.
స్టార్ బాయ్ సిద్ధు మాత్రం వావ్ అనిపించాడు. తన డైలాగ్స్ సిద్దూనే రాసుకున్నట్టు ఉన్నాడు. తెలిసిపోతుంది. జగపతి బాబు ఓపెనింగ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటారో సినిమా మొత్తం అంత అగ్రెసివ్ గా కనిపించలేదు. ఇక మిగితా వాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
2011-12 అని పదేపదే ఎందుకు అనాల్సి వచ్చిందంటే 2011లో హరీశ్ శంకర్ తీసిన మిరపకాయ్, 2012లో తీసిన గబ్బర్ సింగ్ తర్వాత ఆయన అక్కడే ఆగిపోయినట్లు, అప్ డేట్ కానట్లు ఈ సినిమా చూస్తే ఎవ్వరికైనా అనిపిస్తుంది. ఈ సినిమా 2013లో తీసి చూస్తే బాగానే అనిపిస్తుందేమో కాని… మిరపకాయ్, గబ్బర్ సింగ్ తర్వాత చాలానే సినిమాలు వచ్చాయి.
స్ట్రాంగ్ స్టోరీ, పవర్ ఫుల్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు జనాలు చాలానే చూసేశారు. 3 గంటల సినిమాలో 10నిమిషాలు కూడా బోర్ కొట్టకుండా 100 ట్రైలర్లు ఒకే సారి చూసినట్లు తీసిన కేజీఎఫ్, ఎమోషన్ తో పాటు దేశభక్తి నేపథ్యం ఉన్న RRR వంటి సినిమాలు హరీశ్ శంకర్ చూడకపోయినా.. జనాలు చూశారు. ఆలాంటి సినిమాలు మళ్లీ తీస్తేనే చూడలేని.. చూసే మూడ్ లేని ప్రజెంట్ సిట్యువేషన్ లో 2011లో వచ్చిన మిరపకాయ్ లా సినిమా తీస్తా.. మీరు సచ్చినట్లు… నచ్చలేదని చెప్పకుండా చూడాలి అంటే ఎలా?
అన్నట్లు హీరోయిన్ భాగ్యశ్రీ గురించి మర్చిపోయా కదా. నేను ఈ మధ్య ఇన్ స్టాలో చూసిన చుక్కల కంటే… ఈ సినిమాలో భాగ్య శ్రీ బొడ్డును హరీశ్ బాగా చూపించారు. ఇంకా చెప్పాలంటే.. రవితేజ కంటే ఎక్కువ సార్లు దాన్నే చూపించడానికి ట్రై చేశారు.
మొన్న క్రితి శెట్టి, నిన్న శ్రీలీల నేడు భాగ్య శ్రీ.. రేపు ఇంకా కొత్తగా గరిమనాభిని చూపించే సుందరీమణులు వస్తూనే ఉంటారు. మనం చూస్తేనే ఉంటాం. కాజల్, సమంతలా ఓ పదేళ్లు ఇండస్ట్రీని దున్నేసే రోజులు కావులే. ఇన్ స్టాలో రీల్ స్క్రోల్ అయినంత ఈజీగా హీరోయిన్లు మారిపోతూనే ఉంటారు. పెద్ద తేడా ఏం లేదు.
మార్పులు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. హరీశ్ శంకర్ అని పెట్టుకున్నారు బాగానే ఉంది. చేసిన మార్పుల్లో హరీశ్ మార్క్ ఏ మేరకు ఉందో ఆయనకే తెలియాలి. రవితేజ హీరోయిజానికి సరిపోయే దమ్మున్న డైలాగ్స్ లేవు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో క్వచ్చన్లకు ఇచ్చే ఆన్సర్ల మీద పెట్టే కాన్సట్రేషన్ ఈ సినిమాలో మాటల మీద పెట్టుంటే… ప్రొడ్యూసర్ కు ఇంకో నాలుగు టికెట్లు అయినా తెగుండేవి.
అయినా మిసెస్ బచ్చన్ అని అంటే జయా బచ్చనే ఊరుకోకుండా పార్లమెంట్ మొత్తం షేక్ చేసేశారు. ఈ చిన్న లాజిక్ మిస్ అయి హీరోయిన్ తో మిసెస్ బచ్చన్ అనిపించారు మన డైరెక్టర్. బచ్చన్ అంటే ఏదో సినిమాలో ఏదో హీరో పేరు కాదు కదా.. స్వయంగా అమితా బచ్చనే కదా.. మరి జయా బచ్చన్ లెటెస్ట్ గా చేసిన కామెంట్స్ మిస్ అయితే ఎలా హరీశ్ గారు.. ఓహో మనకు కథతో పాటు కరెంట్ అఫైర్స్ మీద కూడా…. ఝూూూూ.. ( https://youtu.be/8B6lSY2zaUs?si=z_oAF_Rkme3TpKqN )
లాస్ట్ బట్ నాట్ లీస్ట్…
రీమేక్ లు తీసే డైరెక్టర్లకు కోట్లు ఇచ్చే ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు… రివ్యూలు రాసే జర్నలిస్టులకు జీతాలు ఇచ్చే సంస్థలు ఉండటంలో ఆశ్చర్యమేముంది..?
అయ్యో… ఇది నా డైలాగ్ కాదు సుమీ…. మీ డైలాగే హరీశ్ గారు. కొంచెం యాడ్ చేసి లెంత్ పెంచా అంతే.. హర్ట్ అయితే సారీ యే…
బాటమ్ లైన్
బుల్షిట్ బచ్చన్..