ఒక ఉప ఎన్నిక .. ఎన్నో నిజాలు !!

Sharing is Caring...

Facts to know…………………………….

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ .. ఫలితాలను పరిశీలించి చూస్తే చాలా విషయాలు అర్ధమవుతాయి. 

@ కేవలం సంక్షేమ పధకాలు మాత్రమే ఎన్నికల్లో పార్టీని గెలిపించవని మరోమారు తేలిపోయింది. 

@ 2019 ఎన్నికల్లో పసుపు కుంకుమ పధకం ప్రవేశపెట్టి నాడు చంద్రబాబు భంగపడ్డారు. 

@ తాజాగా దళిత బంధు కూడా కేసీఆర్ ను గెలిపించలేకపోయింది. ఇది ఎన్నికల కోసమే ప్రవేశపెట్టారా అన్న సందేహాలు జనం లో కలిగాయి. 

@ ఇతర వర్గాల్లో పేదలు ఈ దళిత బంధు పై వ్యతిరేకతను చూపారు.

@ సంక్షేమ పధకాలు అమలు చేస్తే చాలు అనుకుంటున్న ఏపీ సీఎం జగన్ కూడా హుజురాబాద్ ఎన్నికను చూసి జాగ్రత్తపడాల్సిన రోజులు వచ్చాయి. 

@ ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపినా గెలుస్తామన్న అతి విశ్వాసం పార్టీ నేతలకు పనికి రాదు.

@ ఆ విశ్వాసం తప్పని తేలిపోయింది. చేదు ఫలితం వచ్చింది. 

@ ఈటల బీజేపీ నేతగా కనిపించలేదు .. వ్యవహరించలేదు. అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది. 

@ చంపుకుంటారా.. సాదుకుంటారా అన్న ఈటల మాట జనంలోకి దూసుకెళ్లింది. 

@ పార్టీ లో ఒక నేత నచ్చకపోతే అతగాడిని పార్టీ నుంచి పంపేయాలి. అంతే గానీ కక్ష సాధింపులకు పూనుకుంటే .. అది ప్రజలు గమనిస్తే  రాజకీయంగా  నష్టం జరుగుతుంది. 

@ నచ్చని నేతలపై కేసులు పెట్టడం .. ఇరికించే యత్నం చేయడం వంటి పనుల వలన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

@ అవినీతి ఆరోపణల విషయంలో అందరి పట్ల ఒకే రీతిలో స్పందించాలి. ఒకరిని దగ్గర పెట్టుకోవడం మరొకరిని బహిష్కరించడం సరైన విధానం కాదు.  

@ ప్రత్యర్థి ని ఏకాకి చేయాలన్న లక్ష్యంతో  వలసలు ప్రోత్సాహించే వ్యూహాలు అన్ని వేళల వర్కౌట్ కావు.

@ సొంత సర్వేలు .. సొంత ఛానల్ .. సొంత పత్రిక ఫీడ్ బ్యాక్ ను నమ్మకూడదు.

@ కేవలం ఈ ఉప ఎన్నిక ఓటమితో కేసీఆర్ రాత్రికి రాత్రే బలహీనపడరు. ముందు ముందు జాగ్రత్త పడాలని జనాలు ఒక సూచన చేశారు.

@ కేవలం ఈ ఎన్నిక తరహా ఫలితాలే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వస్తాయని ఎవరైనా ఊహించుకుంటే అది భ్రమ మాత్రమే. 

@ ఇక ఈ ఉప ఎన్నికలో గెలుపు ఈట‌ల రాజేంద‌ర్ దా? బీజేపీ దా? అనే ప్రశ్న కు జవాబు. 70 శాతం రాజేందర్ దే. 30 శాతం బీజేపీ ది. ఈటల వంటి బలమైన అభ్యర్థి దొరక్కపోతే బీజేపీ కూడా ఇబ్బంది పడేది.

@ ఈట‌లను చూసి ఓటర్లు క‌మ‌లం గుర్తుకు ఓటు వేశారు.ఇది నిష్టూర‌మైన నిజం. బీజేపీ నేతలు ఒప్పుకోక పోవచ్చు.

@ కాంగ్రెస్ తన గెలుపు కంటే తెరాస ఓటమిని కోరుకుంది. ఆ దిశగా ప్రయత్నించిందనేది నమ్మలేని నిజం.

@ తెలంగాణ‌లో బీజేపీ మ‌రీ అంత బ‌ల‌హీనంగా లేదు. ఈ ఒక్క గెలుపుతోనే బీజేపీ తెలంగాణ లో అధికారాన్ని సొంతం చేసుకోవడం కూడా సులభం కాదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!