Nude Show …………………………………………ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు విదేశాల్లో నగ్న ప్రదర్శనలు ఎక్కువగా చేస్తుంటారు.అలాంటి ప్రయత్నమే ఇజ్రాయెల్ లో జరిగింది. డెడ్ సీ.. క్రమేణా క్షీణించి పోతున్న నేపథ్యంలో ..ఈ అంశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నగ్న ప్రదర్శన జరిగింది. ఈ డెడ్ సీ ని ఉప్పు సముద్రం అని కూడా పిలుస్తారు. డెడ్ సీ కి తూర్పున జోర్డాన్ … పశ్చిమాన ఇజ్రాయెల్ సరిహద్దులుగా ఉన్నాయి.
ప్రముఖ అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ వినూత్న ప్రయత్నం చేశారు. 300 మంది స్త్రీ, పురుష వాలంటీర్ల శరీరాలకు తెల్లని రంగు వేసి.. ఈ సముద్రం వద్ద నగ్నంగా నిలబెట్టి ఫొటోలు తీశారు. వాటిని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లారు.
స్పెన్సర్ గతంలో ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో కూడా ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించారు. రెండు గంటలపాటు సాగిన ఈ ఫొటోషూట్‌ను ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రమోట్ చేయడం విశేషం.నాలుగు రోజుల క్రితం వాలంటీర్లంతా ఇజ్రాయెల్ నగరం ఆరద్‌కు చేరుకున్నారు. వీరిని నగ్నంగా నిలబెట్టి శరీరాలకు తెల్లని రంగు వేశారు.
“ఇజ్రాయెల్ సందర్శన తనకు గొప్ప అనుభవమని ..ఇటువంటి కళను అనుమతించే ఏకైక దేశం మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ మాత్రమే”అని ఈ సందర్భంగా స్పెన్సర్ చెబుతున్నారు. డెడ్ సీని పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత పై ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఈ ఫొటో షూట్ ఉపయోగ పడుతుందని ఈ కార్యక్రమ నిర్వాహకులు అంటున్నారు.
ఇజ్రాయెల్, దాని పొరుగు దేశాలు ఈ సముద్ర జలాలను వ్యవసాయానికి మళ్ళించాయి. భూమి అత్యంత లోతైన స్థాయిలో ఉన్నకారణంగా ఈ సముద్రం క్రమంగా క్షీణిస్తోంది. 1930 లో దీని ఉపరితల వైశాల్యం 1,050 కి.మీ ఉండగా ప్రస్తుతం ఉపరితల వైశాల్యం 605 కిమీ కి తగ్గిపోయింది. డెడ్ సీ అనేది అసలు సముద్రం కాదు. ఒక సరస్సు మాత్రమే.
దాదాపు రెండు మిలియన్ల సంవత్సరాల క్రితం రిఫ్ట్ లోయ .. మధ్యధరా సముద్రం మధ్య ఉన్న భూభాగం అంతా సరస్సుగా మారింది. సముద్రం నీళ్లు కూడా ఇందులోకి వచ్చి చేరాయి. అందువల్లనే దీన్ని కూడా సముద్రంగా పిలుస్తారు. సాధారణ సముద్రపు నీటి కంటే దాదాపు 10 రెట్లు ఈ సముద్రపు నీళ్లు ఉప్పగా ఉంటాయి. జోర్డాన్ నది నుండి నీరు ఈ సముద్రంలోకి ప్రవహిస్తుంది.
ఈ సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో హోటళ్లు .. రిసార్టులు .. రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. పర్యాటక స్థలంగా బాగా గుర్తింపు పొందింది. ఇక్కడ హెల్త్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ డెడ్ సీ లో ఉప్పు ..ఖనిజాలు అధికంగా ఉండటం మూలానా కొన్ని సమస్యలకు ఈ ప్రాంతం చికిత్సా కేంద్రం గా మారింది. మొటిమలు, సోరియాసిస్ ..సెల్యులైట్, అలాగే కండరాల నొప్పి, ఆర్థరైటిస్ .. ఇతర చర్మ సమస్యలున్నవారు చికిత్సకోసం ఇక్కడికి వస్తుంటారు. పలు రకాల చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.