యాక్షన్ ప్యాక్డ్ డ్రామా !

Sharing is Caring...

The life story of a gangster …………………….

ఒక గ్యాంగ్ స్టర్ జీవిత కథే మాలిక్ సినిమా.2021లో మలయాళ భాషలో  సినిమా రిలీజయింది.ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. భూ ఆక్రమణలు,దాడులు,అక్రమ వ్యాపారాలు, మతాంతర వివాహా పరిమాణాల వంటి ఘటనల సమాహారంగా సినిమా సాగుతుంది.

కేరళ లోని తిరువనంతపురం జిల్లా తీర గ్రామం రామడపల్లి చుట్టూ కథ అల్లారు. కథ తెరకెక్కించిన తీరు బాగానే ఉంది. కానీ సినిమా నిదానంగా సాగుతుంది. కొంత కథ ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది. చదువుకోకుండా చెడు స్నేహాల ప్రభావంగా గ్యాంగ్ స్టర్ గా మారిన సులేమాన్  పోలీసులను…రాజకీయ నేతలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. 

ఈ క్రమంలో గ్రామంలో తుఫాన్ బాధితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో  రాజకీయ నాయకులు ప్రయివేట్ వ్యక్తులతో కలసి ఓ ప్రాజెక్టు చేపడుతుండగా సులేమాన్ అడ్డుకుంటాడు. అతగాడిని అడ్డు తప్పించడానికి పాత కేసులో హాజ్ యాత్రకు వెళ్లే తరుణంలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అక్కడ నుంచి జైల్లో సులేమాన్ ను చంపేసే ప్రయత్నాలు చేస్తారు.మేనల్లుడిచే చంపించే విధంగా ప్లాన్ చేస్తారు. ఆ మేనల్లుడు రాజకీయ నేతలపై రాళ్లు విసిరి జైలుకు వస్తాడు. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

మేనల్లుడి గా అమన్ బాగా నటించాడు. మేనల్లుడు సులేమాన్ ను చంపడంలో విఫలమైనప్పుడు డాక్టర్ పాత్ర వచ్చి స్టెత్ గొంతుకు ను బిగించి చంపేస్తుంది. అలా ఎందుకు ఆ పాత్ర చేసింది అనే దానికి జస్టిఫికేషన్ చూపిస్తారు.పగ,ప్రతీకారం కథను నడిపిస్తాయి. ఈ సన్నివేశాలు పూర్తి నాటకీయంగా నడుస్తాయి. 

సులేమాన్ తల్లి కొడుకుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడానికి ముందు కొస్తుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది అనేది సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది. అలాంటి తల్లులు ఉంటారా అన్న సందేహం కూడా కలుగుతుంది. సులేమాన్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఇమిడి పోయాడు. యువకుడిగా,మధ్య వయస్కుడిగా,వృద్ధుడిగా సహజరీతిలో నటించాడు.మూడు వేరియేషన్స్లో ఫాజిల్ ప్రతిభ కనబరిచాడు.ఫాజిల్ ఆహార్యం, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

సులేమాన్ భార్య పాత్రలో నిమిషా నటన ఆకట్టుకుంటుంది.పాత్ర పరిధి తక్కువైనా బాగా నటించిందింది సినిమా మొత్తం సీరియస్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. కథలో ఈపాత్ర కూడా ముఖ్యమైనదే.

డేవిడ్ పాత్రను కూడా ఆసక్తికరం గా మలిచారు. సినిమాలో ఘర్షణ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. రెలిజియస్ టచ్ ఉన్న ఈ కథ ను దర్శకుడు మహేష్ నారాయణ్ ఆసక్తికరంగానే తెర కెక్కించారు. ఫోటో గ్రఫీ .. సంగీతం ఆకట్టుకుంటాయి.సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ ప్రతి సన్నివేశాన్నీ చక్కగా తెరకెక్కించారు

అయితే ఈ తరహా కథలు అందరికి నచ్చవు.సీరియస్ సినిమాలు చూసే వారికి నచ్చుతుంది. నిడివి ఎక్కువ.  సినిమా ను కొంచెం ఓపికతో చూడాలి”మాలిక్” వాణిజ్య పరంగా విజయం సాధించలేకపోయింది. పాజిటివ్ సమీక్షలు వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.యూట్యూబ్ లో ఉంది.. చూడని వారు చూడవచ్చు.  

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!