ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు !

Sharing is Caring...

Strange custom…………………

ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు !  అవును .. మీరు చదివింది నిజమే. మామూలుగా మొదటి భార్య జీవించి ఉండగా మగాడు మరో పెళ్లి  చేసుకుంటే చట్టరీత్యా అది నేరం. కానీ రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం అది ఆచారం.

ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు ఉండాల్సిందే. అది ఆచారమే కాదు అవసరం కూడా అంటున్నారు ఆ గ్రామ ప్రజలు. ఆ గ్రామం పేరు ‘దెరాసర్’. బార్మర్ జిల్లాలో ఉంది ఈ వింత గ్రామం.ఈ  గ్రామం జనాభా కేవలం 600 మాత్రమే. ఆ గ్రామంలో పురుషుల కంటే స్త్రీల జనాభాయే ఎక్కువ.ఇండో-పాక్ సరిహద్దుకు దగ్గరగా  ఈ గ్రామం ఉంది.

ఈ ఇద్దరు భార్యల ఆచారం ఇప్పటిది కాదు కొన్ని వందల ఏళ్ళ నుంచి సాగుతోందట. ఆ ఆచారాన్ని ఆ ఊరి గ్రామస్తులు పాటించాల్సిందే. ఎందుకు పాటించాలి అని అడిగితే ..పిల్లల కోసమని  చెబుతుంటారు.మొదటి భార్యను చేసుకుని పిల్లల కోసం ఎంత కాలం చూసినా పుట్టరట. 

రెండో పెళ్లి చేసుకున్నాక..రెండో భార్యకు పిల్లలు పుట్టాకే మొదటి భార్యకు పిల్లలు పుడతారట. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదంతా నిజమేనని ఆ గ్రామప్రజలు అంటారు. అలా ఎప్పటినుంచో జరుగుతోందట. ఏ ఒక్కరికో …ఇద్దరికో కాదు కాదు గ్రామం మొత్తం అలాగే జరుగుతోదని అంటారు. అందుకే ఆ దెరాసర్ గ్రామంలో మగాళ్లు తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు. 

మొదటి భార్యను చేసుకొని ఎన్నిఏళ్ళు ఎదురు చూసినా…  ఎన్నిదేవుళ్ళకు మొక్కినా ఆమెకు పిల్లలు మాత్రం పుట్టరట. రెండో పెళ్లి చేసుకుంటేనే మొదటి భార్యకు కూడా పిల్లలు పుడతారట. ఆ ఊరి ప్రజలకు మాత్రమే అలా అవుతుందట.  అందుకే.. మొదటి భార్యే దగ్గరుండి తన భర్తకు దగ్గరుండి మరీ రెండో పెళ్లి జరిపిస్తుంది.

అందరూ ఒకే చోట కలసి ఉంటారట.ఇద్దరు భార్యలు కలసి పని చేసుకుంటారు.కలసి వంట చేసుకుంటారు. ఒకే చూరు కింద విడి విడి పొయ్యిలు.. వంటలు ఉండవట. ఇంకో తమాషా ఏమిటి అంటే రెండో భార్యకు అబ్బాయి పుడితే .. మొదటి భార్యకు అబ్బాయే పుడతాడట.

సవతుల పోరు ..గొడవలు ..ఆస్తులు హక్కులు కోసం కొట్లాటలు కూడా ఉండవట. పిల్లల పెంపకం బాధ్యత సమానంగా స్వీకరిస్తారట. జైసల్మీర్,బార్మర్ ప్రాంతాల్లో మైనార్టీ కమ్యూనిటీస్ లో ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకోవడం సహజమే అంటారు. మొత్తానికి వీళ్ళ ఆచారం భలే ఉంది కదా.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!