ఆమె పిచ్చి ప్రేమకు ఏడుగురు బలి !

Sharing is Caring...

ఆమె డబుల్ ఎమ్మే చేసింది. అంత పెద్ద చదువులు చదివి ఏం ప్రయోజనం ? విచక్షణ కోల్పోయింది. ప్రేమ మత్తులో పడింది. ప్రియుడితో కలసి ఏడుగురు కుటుంబ సభ్యులను దారుణంగా చంపేసింది. ఇదొక రకమైన ప్రేమ కథ. ఆవేశంలో చేసిన తప్పుకు ఫలితంగా ఇపుడు జైల్లో కూర్చొని విలపిస్తోంది. త్వరలో ఉరికంబమెక్కబోతోంది. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన తర్వాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ గా చరిత్ర కెక్కబోతోంది. ఇక అసలు కథ లోకి వెళితే యూపీ లోని అమ్రోహ జిల్లా భవన్కేడి గ్రామానికి చెందిన షబ్నమ్ ఎమ్మే వరకు చదువుకుంది. ఆమె ఐదో తరగతి డ్రాప్ అవుట్ అయిన సలీంను ప్రేమించి పెళ్లాడాలనుకుంది. ఇంట్లో విషయం చెప్పింది. సలీం వివరాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ పెళ్ళికి నిరాకరించారు.

ఆ తిరస్కరాన్ని షబ్నమ్ దీనిని జీర్ణించుకోలేకపోయింది. కుటుంబ సభ్యులపై ద్వేషం పెంచుకుంది. ప్రియుడు సలీంతో కలిసి పథకం పన్నింది. అందరిని అడ్డు తొలగించుకుని పెళ్లి చేసుకుని ఎక్కడి కైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేశారు. ముందుగా ఆహారంలో మత్తు మందు కలిపి … అందరూ స్పృహ తప్పాక ఇద్దరు కలసి అందరిని గొడ్డలితో నరికేశారు. ఈ ఘటనలో షబ్నమ్ తల్లిదండ్రులతోపాటు సోదరులు,వారి భార్యలు,10 నెలల వయసున్న మేనల్లుడు హతమయ్యారు. ముందుగా గుర్తు తెలియని దుండగులు ఎవరో దాడి చేసి కుటుంబసభ్యులను చంపారని అబద్ధాలు చెప్పింది షబ్నమ్.

పోలీసులకు అనుమానమొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకుంది. తర్వాత సలీం ను పట్టుకున్నారు. ఈ సంఘటన 2008 ఏప్రిల్ 14 న జరిగింది.  ఈ కేసులో షబ్నమ్‌, సలీంలను దోషులుగా తేల్చిన స్థానిక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. దీంతో వారు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా  అక్కడా వారికి చుక్కెదురైంది. చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ కూడా వారికి ఊరట లభించలేదు.ఈ క్రమంలో ఆ ఇద్దరిని ఉరి తీయబోతున్నారు. ప్రస్తుతం షబ్నమ్ రాంపూర్ జిల్లా జైలులో కూర్చొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. సలీం ఆగ్రా జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. కాగా మధుర జైలులో మాత్రమే మహిళలను ఉరి తీసే అవకాశం ఉంది. అక్కడ షబ్నమ్ ఉరిశిక్ష అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సలీం  ఉరి ఎక్కడనేది ఖరారు కాలేదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!