కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఒరగబెట్టింది ఏమి లేదు. పైగా షాకులిచ్చింది. డ్యూటీలు తగ్గించి.. సెస్సులు పెంచడం వల్ల లాభమేమి లేదు. ఒకటి రెండు విషయాల్లో ఊరట తప్ప మిగిలినవన్నీ వడ్డింపులే. అగ్రి అండ్ ఇఫ్రా డెవలెప్‌మెంట్ సెస్ పేరుతో భారీగా వడ్డించారు. ఓవైపు గోల్డ్ సిల్వర్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూనే మరోవైపు సెస్ పెంచేశారు. గోల్డ్ సిల్వర్‌పై 2.5శాతం అగ్రిసెస్ వేశారు. ఇక ఆల్కహాల్‌పై వందశాతం సెస్ విధించారు. దీంతో ప్రతీ వంద రూపాయల బాటిల్‌పై పదిరూపాయల ధర పెరగనుంది. క్రూడ్ పామాయిల్‌పై 17.5శాతం సెస్ విధించారు. క్రూడ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 20 శాతం సెస్ పడింది. దీంతో వంటనూనెల ధరలు భారీగా పెరగనున్నాయి. యాపిల్ ధరలపై 35శాతం సెస్ విధించబోతున్నారు. దీంతో కశ్మీర్, సిమ్లా యాపిల్స్ కేసి సామాన్యులు, మధ్యతరగతి వారు కన్నెత్తి చూడలేరు. బొగ్గు, లిగ్నైట్ పై ఒకటిన్నర శాతం.. కొన్నిరకాల ఫెర్టిలైజర్ల పై 5శాతం.. కాటన్‌పై 5శాతం సెస్ పడబోతోంది. ఇక బఠానీపై 40శాతం, పల్లీలపై 30శాతం, పప్పుదినుసులపై 50శాతం అగ్రిసెస్ పడబోతోంది. ఇవన్నీ సామాన్యులకు భారం అవుతాయి.
ఈ సెస్ ఎలా వేస్తారో క్లారిటీ లేదు. అగ్రిసెస్ పేరుతో పెట్రోల్ ధరలూ పెరగబోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్నిరకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. అత్మనిర్భర్ భారత్‌లో భాగంగా విధించే ఈ సెస్ ద్వారా వ్యవసాయ, నిర్మాణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తారు.కాగా సెల్‌ఫోన్ ధరలు మళ్ళీ పెరగనున్నాయి.ఈ బడ్జెట్‌లో టెక్నాలజీ రంగంలో అతి ముఖ్యమైన మొబైల్ ఫోన్లు, వాటి పరికరాలు, ఛార్జర్‌లపై కస్టమ్ డ్యూటీని 2.5 శాతం పెంచారు. దీంతో వాటి ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం 400 ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఉన్న మినహాయింపులను ఉపసంహాకోబోతోంది ఉపసంహరించుకోబోతోంది. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.దీని ద్వారా సెల్‌ఫోన్‌లు, వాటి భాగాలు, ఛార్జర్ల ధరలు 5 నుంచి 10శాతం మేర పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.