ఆ హీరోలు ఇపుడు ఏం చేస్తున్నారో ?

Sharing is Caring...

Actors who could not sustain themselves………….

ఒకప్పటి హీరోలు ఇపుడు ఎక్కడున్నారో ? ఏం చేస్తున్నారో ?? అపుడప్పుడు వారిని అభిమానులు తలచుకుంటూనే ఉంటారు. అలాంటి హీరోలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ జాబితాలో తరుణ్, వేణు తొట్టెంపూడి, వడ్డే నవీన్, తదితరుల పేర్లు వినిపిస్తాయి.

తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన తరుణ్ ఇపుడు సినిమాలకు పూర్తిగా దూరమై పోయారు. హీరోగా తొలి సినిమా ‘నువ్వేకావాలి’ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. తర్వాత ‘ప్రియమైన నీకు’, ‘నువ్వులేక నేను లేను’,  ‘నువ్వే నువ్వే’ తదితర సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు.

ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ప్లాఫ్ అవడంతో  బాగా వెనుకబడిపోయారు. హీరోగానే చేయాలనే తలంపుతోనే ఉండటంతో సినిమాలలో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.ఆ మధ్య సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేస్తాడని వార్తలు ప్రచారంలో కొచ్చాయి.

హీరోగా కాకుండా నిర్మాతగా సినిమాలు చేయ బోతున్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. అన్నట్టు తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అన్నారు. తరుణ్ హీరోగా ఉన్నపుడు చాలా ప్రేమకథలు కూడా వినిపించాయి.

అప్పట్లో తరుణ్ ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని కూడా గుసగుసలు వినిపించాయి. హీరోయిన్  ఆర్తి అగర్వాల్ తరుణ్ ను ప్రేమించిందని .. అతను నో చెప్పడంతో ఆత్మహత్య యత్నం చేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆ తర్వాత మరో హీరోయిన్ ప్రియమణి తో కూడా ప్రేమాయణం సాగించాడని గ్యాసిప్స్ వెల్లువెత్తాయి. ఈ ఇద్దరూ కలసి ‘నవవసంతం’ సినిమాలో కూడా నటించారు. ఆ సినిమాలో నటిస్తున్నపుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలొచ్చాయి.

అప్పట్లో ఎక్కడా చూసినా ఈ ఇద్దరే కనిపించేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ప్రియమణి 2017 లో తాను ప్రేమించిన ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ప్రియమణి సినిమాల్లో నటిస్తోంది. తరుణ్ మాత్రం అలాగే ఉండిపోయాడు. అన్నట్టు తరుణ్ తల్లి రోజారమణి కూడా సినిమా నటే. తండ్రి చక్రపాణి కూడా నటుడే . 

ఇక తొట్టెంపూడి వేణు ‘స్వయంవరం’ తో తెలుగు హీరోగా పరిచయమైనారు. తరుణ్ తొలి సినిమా దర్శకుడు విజయభాస్కరే వేణు మొదటి సినిమా డైరెక్టర్. ‘స్వయంవరం’ ప్రేక్షకుల ఆదరణ పొందడంతో వేణుకి వరుస గా ఆఫర్లు వచ్చాయి. ‘హనుమాన్ జంక్షన్’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘పెళ్ళాంతో పనేంటి’ వంటి సినిమాలు వేణుకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.

దాదాపు 25 సినిమాల్లో నటించిన వేణు 2013 తర్వాత వెనుక బడ్డాడు. వేణు చివరి సినిమా ‘రామాచారి’. అది ప్లాఫ్ అయింది. సినిమాల్లో నటిస్తుండగానే పెళ్లి చేసుకుని, వ్యాపారం మొదలు పెట్టారు వేణు.2021 లో రవితేజ హీరోగా చేసిన రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలో నటించారు. ప్రస్తుతం వేణు బిజినెస్ లో బిజీబిజీగా ఉన్నారు.

తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోల్లో వడ్డే నవీన్ కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను స్వల్ప కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే చేయడంతో లేడీ ఫాలోయింగ్ పెరిగింది.1997లో ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో పరిచయమైనాడు వడ్డే నవీన్.

‘ప్రియ ఓ ప్రియా’, ‘చెలికాడు’, ‘పెళ్లాడి చూపిస్తా’, ‘లవ్ స్టోరీ 1999’, ‘మనసిచ్చి చూడు’, ‘స్నేహితులు’, ‘ప్రేమించే మనసు’, ‘మా బాలాజీ’, ‘బాగున్నారా’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘నా ఉపిరి’ ఇలా దాదాపుగా 30 సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు వడ్డే నవీన్. కొన్ని సినిమాల్లో నెగెటివ్ రోల్స్ కూడా చేసాడు.

2016లో రిలీజైన మంచు మనోజ్ ఎటాక్ సినిమాలో చివరిగా కనిపించాడు నవీన్. సినిమాలకు దూరంగా ఉంటోన్న నవీన్ ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది..వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఎదురైనాయి.

ఎన్టీఆర్ మనవరాలు చాముండేశ్వరి( రామకృష్ణ కూతురు)ని పెళ్లి చేసుకున్ననవీన్ విడాకులు తీసుకుని రెండో వివాహం కూడా చేసుకున్నాడు. మళ్ళీ సినిమా రంగంలోకి నిర్మాతగా ప్రవేశించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!