ఇకపై కొన్ని ఫోన్ల లో వాట్సాప్ పనిచేయదు!

Sharing is Caring...

వాట్సాప్ ఇక పై అన్ని ఫోన్లలో పనిచేయదు . 2021 జనవరి 1నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని అంటున్నారు. కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం ఐఫోన్‌లో ఐవోఎస్‌ 9, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కన్నా ముందువి ఉంటే వాటిలో మాత్రం వాట్సాప్‌ పనిచేయదు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలి. ఐఫోన్లలో ఐవోఎస్‌ 9 అంటే ఐఫోన్‌ 4, దానికన్నా ముందు వచ్చిన మోడళ్ల ఐఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు.  ఐఫోన్‌ 4ఎస్‌, ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5ఎస్‌, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌ ఫోన్లు  ఉంటే ….వెంటనే  వాటిని ఐవోఎస్‌ 9కు అప్డేట్‌ చేసి వాట్సాప్‌ను మళ్ళీ వాడుకోవచ్చు.

ఐఫోన్‌ 6ఎస్‌, 6 ప్లస్‌, ఐఫోన్‌ ఎస్ ‌ఈ ఫస్ట్‌ జనరేషన్‌ ఫోన్లను ఐవోఎస్‌ 14కు అప్డేట్‌ చేసుకోవాలి. అదే ఆండ్రాయిడ్‌ ఫోన్లలో అయితే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 4.0.3కు అప్డేట్‌ చేసుకోవాలి. ఈ వెర్షన్‌ హెచ్‌టీసీ డిజైర్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ బ్లాక్‌, మోటరోలా డ్రోయిడ్‌ రాజర్‌, ది శామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌2, ఇంకా చాలా ఫోన్లలో ఉండదు. కాబట్టి ఈ ఫోన్లలో 2021 నుంచి వాట్సాప్‌ ఉపయోగించడం కుదరదు.కాబట్టి  వేరే ఫోన్ ఉంటే అందులో వాట్సాప్ వాడుకోవడమే మార్గం. ఇక  ప్రస్తుతం ఉపయోగిస్తున్న  ఫోన్‌లో ఏ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఉందో తెలీని వాళ్ళు కూడా ఉంటారు. వారంతా కంగారు పడాల్సిన అవసరం లేదు.  ఐఫోన్‌ వాడుతున్నట్టు అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌  ఆప్షన్‌ను క్లిక్‌ చేసి తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ను ఉపయోగిస్తున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎబౌట్‌ ఫోన్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే  ఫోన్‌ వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే మీ ఫోన్లలో కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌ ఆప్షన్‌ ఉంటే వాటిని వెంటనే అప్డేట్‌ చేసుకోండి. లేదంటే కొత్త ఫోన్‌ కొనక తప్పదు.

కోట్లాది మంది అభిమానాన్ని చుర‌గొన్న‌యాప్ వాట్సాప్ లో కొత్తకొత్త ఫీచర్స్ వస్తున్నాయి.  వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు మొబైల్‌ వెర్షన్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాగా.. త్వ‌ర‌లోనే వాట్సాప్‌ వెబ్‌  యూజర్లకు కూడా ఆ స‌దుపాయాలు అందుబాటులోకి తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి.ఈ స‌రికొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తే.. వెబ్‌ యూజర్ల కూడా వాయిస్‌, వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అలాగే వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్ మరొకటి.  నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా  భాగస్వామ్యంతో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్‌(యూపీఐ) ను ఉపయోగించి పేమెంట్స్‌ చేస్తుంది.  ఇందుకోసం 160 బ్యాంకులతో టై అప్ కుదుర్చుకుంది.  ఇండియాలో వినియోగదారుల కోసం ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జియో పేమెంట్స్‌తో ఒప్పందాలు చేసుకుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!