అమెజాన్ నది అతి భయంకరమైనదా ?

Sharing is Caring...

The second longest river in the world ……………….

అమెజాన్ నది ప్రపంచంలోనే అతిపెద్ద నది. ఇది నీటి ప్రవాహం పరంగా అతిపెద్దది.. పరిమాణంలో రెండవ పొడవైన నది. దీనికి 1,000 కి పైగా ఉపనదులు ఉన్నాయి. అమెజాన్ నది పరిసర ప్రాంతాలు  ప్రమాదకరమైనవి. క్రూర జంతువులు,విష సర్పాలకు, కీటకాలకు నెలవు.నది చుట్టుపక్కల దొంగతనాలు, దోపిడీలు జరుగుతుంటాయి. 

ఈ నదికి సంబంధించి ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

@ అమెజాన్ నది ప్రతి సెకనుకు 200,000 లీటర్ల మంచినీటిని సముద్రంలోకి పంపుతుంది.. అమెజాన్ నది పొడవు దాదాపు 4,000 మైళ్లు అని పరిశోధకులు చెబుతున్నారు. నైలు నది పొడవు దాదాపు 6,650 కిలోమీటర్లు (4,132 మైళ్ళు) ఉంటుంది.ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నది.

@ అమెజాన్ నది ఆండియన్ పర్వతాలలో ప్రారంభమవుతుంది. అమెజాన్ నది అసలు ప్రారంభ స్థానం గురించి కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ, అది పెరూలోని ఆండెస్ పర్వతంలోనే పుట్టింది.

@ అమెజాన్ నది, దాని ఉపనదులు పది వేర్వేరు దేశాల గుండా ప్రయాణిస్తాయి.పెరూ తర్వాత, నది ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా, బ్రెజిల్ ,బొలీవియా గుండా పయనిస్తుంది. అది చాలా గొప్ప ప్రయాణం.

@ ఆశ్చర్యకరంగా గతంలో నది వ్యతిరేక దిశలో ప్రవహించేది. ప్రకృతి తన మార్గాన్ని కనుక్కుంటుందని చెప్పడానికి అద్భుతమైన సాక్ష్యంగా, 15 మిలియన్ సంవత్సరాల క్రితం ఆండియన్ పర్వతాలలో పుట్టిన ఈ నది పూర్వ ప్రవాహానికి అంతరాయం కలిగింది. నది కొంచెం ఆలోచించి, అట్లాంటిక్‌లోకి ప్రవహించే వేరే మార్గాన్ని కనుగొంది. ఒకప్పుడు అమెజాన్ నది పసిఫిక్ మహాసముద్రం వైపు ప్రవహించేది, ఇవాళ అది అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవహిస్తున్నది.

@ ఈ నదిలో పింక్ డాల్ఫిన్లు ఉన్నాయి.. ప్రపంచంలోని నాలుగు జాతుల నది డాల్ఫిన్లలో ఒకటైన అమెజాన్ నది డాల్ఫిన్ 18 మిలియన్ సంవత్సరాలుగా దక్షిణ అమెరికా మంచినీటిని ఆస్వాదిస్తోంది..@– ఇందులో పిరాన్హా చేపలు కూడా ఉన్నాయి.ఇవి దక్షిణ అమెరికాకు చెందినవి..సాధారణంగా అమెజాన్ బేసిన్‌లో కనిపిస్తాయి.

@ దక్షిణ అమెరికా పిరాన్హాలు అంత ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవి కావు. మనిషి వాసనను పసిగడితే పిరాన్హా చేపలు గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి. రక్తాన్ని పీల్చి వేస్తాయి. అలాగే ఈ నదిలో పిశాచి చేపలు, సొరచేపలు కూడా ఉన్నాయి.

@ భూమిపై ఉన్న వివిధ వృక్షజాలం, జంతుజాల జాతులలో 30% వరకు అమెజాన్ నది చుట్టుపక్కల కనిపిస్తాయని చెబుతారు. మకావ్‌లు, సాలెపురుగులు, పాములు, దాదాపు 400 ఉభయచరాలు అన్నీ అమెజాన్‌ను నివాసంగా చేసుకున్నాయి.

@ అమెజాన్ లో దాదాపు ఏడు అడుగుల పొడవు, 400 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న పిరైబాతో సహా మూడు రకాల క్యాట్‌ఫిష్‌లు ఉన్నాయి. 10 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ పొడవున్న పాములు, 400 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న అరపైమా చేపలు ; 5 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న మూడు రకాల పిరాన్హా చేపలు సంచరిస్తుంటాయి. కొన్ని ప్రాంతాలలో ఈ నదిలో చేపల వేట కూడా కొన సాగుతోంది.

@ అమెజాన్ నదిపై వంతెనలు లేవు. అమెజాన్ నది కింద కొన్ని మైళ్ల భూగర్భంలో హంజా నది ఉంది. ఇది అమెజాన్ మార్గాన్ని అనుసరిస్తుంది.

@ అమెజాన్ నది చుట్టూ ఉన్న అడవుల్లో సుమారు 400 స్థానిక తెగలు జీవిస్తున్నాయి. ఈ తెగల్లో కొంతమందికి బయటి ప్రపంచంతో  సంబంధాలు లేవు. కొందరు నది ఒడ్డున స్థిరపడి నివసిస్తుండగా, మరికొందరు అడవుల్లో సంచార జాతులుగా తిరుగుతూ ఉంటారు. వీరు ప్రధానంగా వేట, చేపలు పట్టడం, పండ్లు సేకరించడం, వ్యవసాయం వంటి వాటిపై ఆధారపడి జీవిస్తారు.

@ స్థానిక తెగల జీవనశైలిలో కొంత మేరకు మార్పులు వచ్చాయి. కొందరు ఆధునిక పద్ధతులను కూడా అనుసరిస్తున్నారు. 

@ గతంలో ఈ నదిని మారనోన్ నది అని పిలిచేవారు, పెరువియన్ ప్రాంతం లో ఇప్పటికీ ఆ పేరుతోనే పిలుస్తారు.

@ ప్రపంచంలోనే గొప్ప ఈతగాడు, మార్టిన్ స్ట్రెల్, అమెజాన్ నది పొడవునా ఈదిన ఏకైక వ్యక్తి. ఆయన తర్వాత మరెవరూ అలాంటి సాహసం చేయలేదు.

@ 2016లో అమెజాన్ డెల్టాలో ఒక భారీ పగడపు దిబ్బ ను కనుగొన్నారు.ఈ దిబ్బ దాదాపు 1,000 కి.మీ (620 మైళ్ళు) పొడవు ఉండి ఫ్రెంచ్ గయానా నుండి బ్రెజిల్‌లోని మారన్హావో రాష్ట్రం వరకు విస్తరించి ఉంది.

@ అమెజాన్ నది నీరు చాలా వరకు కరేబియన్ దీవుల చుట్టూ ప్రవహిస్తుంది.సహారా నుండి వీచే ఎడారి ఇసుక గాలులు ఆఫ్రికా నుండి అమెజాన్ నది వరకు వస్తుంటాయి.

@ గ్రీకు పురాణాలలో మహిళా యోధులను అమెజాన్లు అంటారు. వారు అసాధారణ పోరాట నైపుణ్యాలు, గుర్రపు స్వారీ సామర్థ్యాలు కలిగి ఉన్నారు. స్వతంత్ర సమాజానికి ప్రసిద్ధి చెందారు.కొంతమంది అమెజాన్లు నల్ల సముద్రంలో దోపిడీలు చేసేవారు.

@ మొదటి యూరోపియన్ అన్వేషకుడు, ఫ్రాన్సిస్కో డి ఒరెల్లానా వారి నుంచి దాడులు ఎదుర్కొన్నాడు. అందుకే ఈ నదికి అమెజాన్ అని పేరు పెట్టాడు. ఆవిధంగా ఈ నదికి అమెజాన్ అనే పేరు వచ్చింది.ఈ అమెజాన్ నదిలో కొన్నిప్రాంతాలలో బోటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మరో పోస్టులో ఆ విషయాలు తెలుసుకుందాం. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!