‘భస్మ ఆరతి’ అక్కడ ప్రత్యేకతా ?

Sharing is Caring...

Special features of Mahakaleshwar of Ujjain……. 

జ్ఞాన స్వరూపునిగా పేరుగాంచిన  పరమశివుడి అవతారమే దక్షిణామూర్తి…దేశవ్యాప్తంగా ఆ స్వామి అనేక క్షేత్రాల్లో కొలువై ఉన్నాడు.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ శివుడిని ‘మహాకాళేశ్వరుడు’ అని పిలుస్తారు.

ఈ పన్నెండు క్షేత్రాల్లో శంకరుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్నతీర్థం ఇదే. మరే జ్యోతిర్లింగానికీ ఈ ప్రత్యేకత లేదు. దక్షిణాభిముఖంగా స్వయంభువై వెలసిన మహాకాళేశ్వర ఆరాధనలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

ఉజ్జయిని మహాకాళేశ్వరుని ప్రత్యేకతలు… 

@ ఉజ్జయినిలోని మహాకాళ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ.. పురాతన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి.

@ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన క్షేత్రంగా పరిగణిస్తారు. కానీ ఈ ఆలయం దానిలో ఉన్న రహస్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది. @ ఈ ఆలయంలో  ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు ‘భస్మ ఆరతి’ ఆచారాన్ని పాటిస్తుంది.

@ పురాతన కాలంలో ఉపయోగించిన బూడిద మానవులదే కానీ క్రమంగా ఆ ఆచారం ఆగిపోయింది.. ఇపుడు ఆవు పేడ కేకులు,చెట్ల బెరడుతో చేసిన బూడిదను ఉపయోగించి నిర్వహిస్తున్నారు. ఈ భస్మ ఆరతి ని చూసేందుకు ముందుగా ఆన్లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. అప్పటికపుడు భక్తులను అనుమతించరు.   

@ 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి..  మహాకాళ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకదానికి నిలయంగా ప్రసిద్ధి చెందింది.@ ఉజ్జయినిలో ప్రవహించే ఏకైక నది శిప్రానది. దీనిని పవిత్ర నదిగా పరిగణిస్తారు..కుంభ మేళా ఉత్సవాలు ఈ నది ఒడ్డునే నిర్వహిస్తారు. ఇక్కడే ఆరతి ఇచ్చే ఘాట్ కూడా ఉంది.  

@ దక్షిణ్ముఖి జ్యోతిర్లింగం: సాధారణంగా ప్రతిష్టించబడే ఇతర జ్యోతిర్లింగాల మాదిరిగా కాకుండా, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం దక్షిణ్ముఖి స్వయంభువు..  @  కుంభమేళా జరిగే నాలుగు ప్రదేశాలలో ఉజ్జయిని నగరం ఒకటి.. ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితంలో మహాకాళ ఆలయం ప్రత్యేక స్థానాన్నికలిగి ఉంది.

@ స్థానికుల నమ్మకం ప్రకారం, మహాకాళేశ్వర్ అని పిలువబడే మహాకాళ ఆలయ దేవత నగర సంరక్షకుడు. @ మర్మమైన ఆలయం: మహాకాళేశ్వర ఆలయం పై అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం ఉంది.. నాగ పంచమి రోజున మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు.

@ భూమి కేంద్ర బిందువు ఉజ్జయిని…  వరాహ పురాణం ప్రకారం, మహాకాళేశ్వరురుని ఆలయం భూమి కేంద్ర బిందువు వద్ద ఉంది.. ఈ స్థానం ఒక కీలకమైన విశ్వ కేంద్రంగా ఆలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.

@ ఏడు ‘ముక్తి స్థల్’లలో ఒకటి…  మహాకాళేశ్వరుని ఆలయం భారతదేశంలోని ఏడు ‘ముక్తి స్థల్’ లేదా విముక్తి నిచ్చే పవిత్ర స్థలాలలో ఒకటిగా కూడా పిలువబడుతుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!