Paresh Turlapati……………………. Kumbh Mela strange things ….
కొద్దిరోజులుగా ప్రయాగ్ రాజ్ కుంభమేళా కొచ్చిన సాధువుల ఫోటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కుంభమేళా లో ఇద్దరు అమ్మాయిలు తళుక్కున మెఱసి అందరి దృష్టిలోపడగా .. వారి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఆ ఇద్దరిలో ఒకమ్మాయి ఒకే ఒక్క నవ్వుతో అందరిని తనవైపుకు తిప్పుకుంది.(ఫొటోలో కుడివైపు ఉన్న అమ్మాయి ) ఆ అమ్మాయి పిక్ వైరల్ చేసి చాలామంది వైరల్ ఫీవర్లు తెచ్చు కుంటున్నారు.. అసలు సంగతేంటా అని ఆరా తీస్తే ?
ఈ అమ్మాయి కుంభమేళా లో పూసలు అమ్ముతూ ఒక కళా పురుష్ కళ్లలో పడిందట. అంతే ఆత్రం ఆపుకోలేని కళా పురుష్ పిల్ల ఫోటో ట్విట్టర్లో వదిలాడు. దీంతో పిల్ల ఫోటో వైరల్ అయి దేశమంతా ఈవిడ పుట్టుపూర్వోత్తరాల కోసం గుగులమ్మ ని తెగ గోకేస్తున్నారట.
ఒకరేమో మోనాలిసా అనీ ఇంకొకరేమో రేఖ చెల్లెలనీ రకరకాల డిస్కషన్స్..డిస్కవరీలు చేసేస్తున్నారు. ఇంతకీ ఈ పిల్ల దగ్గర నేను ఇంతవరకు పూసలు కొనలేదు గాబట్టి ఈ అమ్మాయి ఎవరో నాకూ తెలీదు గానీ కానీ ఒకటి మాత్రం తెలుసు. పిల్ల చక్కగా ఉంది. అందులో అనుమానమే లేదు ..మనోళ్లు ఏ బాలయ్య పక్కనో సినిమాల్లోకి లాగేస్తారు.
చూస్తుండండి..అన్నట్టు బాలయ్య అఖండ 2 షూటింగు ఇప్పుడు కుంభమేళా పరిసర ప్రాంతాలలోనే జరుగుతుందట.. అమ్మాయి గోరూ.. చూస్తుండండి..ఏదో రోజు మీరు సినిమాల్లోకి వచ్చేస్తారు.. వచ్చేస్తారు.. అమ్మాయి గారూ..(జోకనుకునేరు.. నిజంగానే అంటున్నా) రచయితలు అలెర్ట్ అయి పూసలోల్లమే పిల్లా .. మేమూ పూసలొల్లమే (ఇది సరదాగా) అనే పాట రాసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక ఫొటోలో ఎడమ వైపు ఉన్న ఆవిడ పేరు హర్ష రిచారియా.. మహాకుంభ మేళాలో ‘అందమైన సాధ్వి’ గా ఈమె అందరి దృష్టిలో పడ్డారు. ఆమె ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. నిరంజనీ అఖడాకు చెందిన సాధువులతో కలిసి హర్ష రిచారియా.. సంగం ఘాట్ కు వెళ్లి, అమృత స్నానం ఆచరించారు.
ఆవివరాలతో ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.(సాధ్వి అయిఉండి ఈమె కూడా మామూలు మనిషిలా వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఏమిటి ? హతోస్మి .. నిజంగా ఈమె సాద్వీ యేనా ?? ) అది కూడా వైరల్ అయింది. ఆమె స్నానమాచరించి రథం చేరే వరకు చేతులు జోడించే ఉన్నారట.ఇంకేముంది జనాలు తమ స్నానాల సంగతి మర్చిపోయి ఆమె ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు. అంతటితో ఊరుకున్నారా ? తగ్గేదెలా అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
ఇంకేముంది ఫోటోలు వైరల్ అయ్యాయి. మరి నెటిజనులు తక్కువ తిన్నారా ? ఈ హర్ష గురించి గూగుల్ లో తెగ వెతికారు.సినిమా హీరోయిన్ లా ఉన్న హర్ష రిచారియా ఎక్కడిది ? ఏం చేస్తుంటుంది ? పోటీ పడి నెట్లో గాలించారు. మొత్తం మీద హర్ష రిచారియా ఎవరో ఎక్కడి వారో కూపీ లాగేసారు.
ఉత్తరాఖండ్ కి చెందిన ఈమె ఒక యాంకర్, సామాజిక కార్యకర్త అని తేల్చారు. నిరంజనీ అఖడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి కైలాసానంద గిరి జీ మహారాజ్ శిష్యురాలుగా ఆమెను గుర్తించారు. ముందు ముందు ఏవిషయాలు తవ్వి తీస్తారో?? అదండీ సంగతి. అయినా పుణ్యస్నానాల కొచ్చి ఇవేం పనులండీ?