‘ఆపరేషన్ జింజర్’ ..అరుదైన సర్జికల్ స్ట్రైక్ !

Sharing is Caring...

సుదర్శన్.టి ………………………………………..

అది జూలై 30, 2011.. కుప్వారా జిల్లా గులందర్ ప్రాంతంలో ఓ మారుమూల ఆర్మీ పోస్టు మీద పాకిస్థాన్ సైన్యం మూకుమ్మడి దాడి చేసింది. కుమావ్, రాజపుత్ రెజిమెంట్లకు చెందిన 6 మంది సైనికులు తేరుకునే లోపు మారణహోమం జరిగిపోయింది.

5 మంది అక్కడికక్కడే హతమయ్యారు.19 రాజ్పుత్ రెజిమెంట్ కు చెందిన సైనికుడు దాడి విషయాన్ని రిపోర్ట్ చేసి తర్వాత ఆసుపత్రిలో మరణించారు. పాక్ సైనికులు, చనిపోయిన భారత్ సైనికుల తలలు నరకడం మొదలెట్టారు. దగ్గర్లోని భారత సైనికుల టీమ్ రావడం గమనించి హవల్డార్ జైపాల్ సింగ్ అధికారి, లాన్స్ నాయక్ దేవేందర్ సింఘ్ ల తలలు తీసుకుని పారిపోయారు.ఆగస్టులో భారత్ బలగాల చేతిలో హతమైన ఒక తీవ్రవాది నుండి దొరికిన మొబైల్ ఫోన్ లో ఒక వీడియో కనబడింది. ఈ ఇద్దరి సైనికుల తలల చుట్టూ కొందరు పాక్ సైనికులు, మరి కొందరు తీవ్రవాదులు డాన్స్ చేయడం ఆ వీడియోలో ఉంది. ఇంకొందరి సైనికుల నవ్వులు వినబడ్డాయి.

ఈ ఘటనపై పాక్ కు బుద్ది చెప్పాలని Chief of Kupwara-based 28 Division ఆఫీసర్ S.K.చక్రవర్తి  నిర్ణయించారు.దాడి టార్గెట్ ఎంచుకోవడానికి కనీసం 8-9 రెక్కీలు నిర్వహించారు. మూడు టార్గెట్లు ఎంచుకున్నారు. పోలీస్ చౌకిగా పిలువబడే పాక్ ఆర్మీ పోస్ట్ ప్రధాన టార్గెట్. హిఫాజత్, లషధత్ లంచ్ ప్యాడ్ లు సెకండరీ టార్గెట్లు.ప్రతీకార దాడులకు ప్లాన్ చేసారు.  

ఈ దాడికి ‘ఆపరేషన్ జింజర్’ అని పేరు పెట్టారు. ఇలాంటి ఒక అతి క్రూరమైన ప్రతీకారదాడి ఈ మధ్య కాలంలో భారత్ చెయ్యలేదని తర్వాత నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఆగస్టు 30, మంగళవారం దాడికి డేట్ ఫిక్స్ చేశారు. అది ఈద్ కు ఒక్కరోజు ముందు. ఆ సమయంలో సరిహద్దు అవతలి నుండి దాడి జరగదని పాక్ కు ఓ గట్టి నమ్మకం.

దాడికి 25 మంది నిష్ణాతులైన పారా-కమాండోలను ఎంపిక చేశారు. వీరు 29న పొద్దున 3 గంటలకు లాంచ్ ప్యాడ్ దగ్గరకు చేరుకుని రాత్రి 10 వరకు అక్కడే దాక్కున్నారు. రాత్రి 10కి LOC దాటి మెల్లగా పాక్ లోకి ప్రవేశించారు. 30 పొద్దున 4 గంటలకు దాడి చెయ్యాల్సిన ఆర్మీ పోస్టుకు చేరుకున్నారు. అంటే LOC నుండి దాదాపు 5-6 గంటల ప్రయాణం. వీరికి భారత్ నుండి ఎటువంటి సైనిక, వైమానిక సహాయం అందే అవకాశం లేదు.

ఆగస్ట్ 30, ఉదయం 4 గంటలు : ఓ గంటలో టార్గెట్ చుట్టూ క్లైమోర్  ల్యాండ్ మైన్ లు పరిచారు. కమాండోలు పొజిషన్ తీసుకుని దాడి చేయడానికి క్లియరెన్స్ కోసం వెయిట్ చేశారు. పొద్దున 7 గంటలకు దాడికి క్లియరెన్స్ వచ్చింది.

అదే సమయంలో నలుగురు పాక్ సైనికులు ఓ JCO ఆధ్వర్యంలో  ambush site వైపు రావడం గమనించారు. వారు మైన్స్ పెట్టిన చోటుకు రాగానే కమాండోలు మైన్స్ పేల్చేసారు. ఆ పేలుళ్లలో నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిపై కమాండోలు గ్రనెడ్లు విసిరి బుల్లెట్ల వర్షం కురిపించారు.

వాళ్ళలో ఒకడు పక్కనే ఉన్న వాగులో పడి కొట్టుకుపోయాడు. కమాండోలు ఆ ముగ్గురు పాక్ సైనికుల తలలు మొండెం నుండి వేరు చేశారు. వాళ్ళ ఆయుధాలు, పర్సనల్ ఐటమ్స్, ఇక వాళ్ళ రాంక్ ను తెలిపే insignias కూడా తీసుకున్నారు.

చనిపోయిన ఒక సైనికుడి శరీరంలో IED ఫిక్స్ చేశారు దీన్నే ‘బాడీ బూమ్’ అంటారు. ఆ శవాన్ని తీసుకెళ్లడానికి వేరే సైనికులు వస్తే వాళ్ళు ఈ పేలుడుకు బలైపోతారు. ఈ పేలుళ్లు విని పోస్టు నుండి ఇద్దరు సైనికులు దాడి జరిగిన ప్రాంతం వైపు దూసుకొచ్చారు.

యాక్షన్ లో ఉన్న కమాండోల వెనుకే ఉన్నసెకండ్  పార్టీ ఈ ఇద్దరు పాక్ సైనికులను మట్టుపెట్టారు. తర్వాత ఇంకో ఇద్దరు సైనికులు భారత్ బలగాల పైకి దాడికి దిగారు.  వెనుక ఉన్న 3వ సైనిక పార్టీ ఆ ఇద్దరిని కూడా మట్టుపెట్టారు.

భారత్ సైనికులు పని ముగించుకుని వెనక్కు మరలుతుండగా కొందరు పాక్ సైనికులు దాడి జరిగిన స్థలం వైపు వెళ్లారు. కాసేపటికి ఒక పెద్ద విస్పోటనం జరిగినట్టు శబ్దం వచ్చింది.   పాక్ సైనికుని శవంలో పెట్టిన IED పేలింది. కనీసం ఇంకో ముగ్గురు పాక్ సైనికులు హతమయ్యారని తర్వాత నిర్ధారణ చేసుకున్నారు.ఈ మొత్తం ఆపరేషన్ 45 నిముషాల పాటు సాగింది.

7.45కు కమాండోలు వెనుదిరిగారు. మొదటి పార్టీ మధ్యాహ్నం 12 గంటలకు  LOC దాటి ఇండియా చేరింది. రెండవ పార్టీ 2.30  గంటలకు  LOC దాటి ఇండియాలోకి వచ్చారు. ఈ ప్రక్రియలో ఒక అపశృతి దొర్లింది. ఆపరేషన్లో ఒక కమాండో స్లిప్ అయి మైన్ మీద పడ్డాడు. అతను చనిపోయాడు అనుకున్నారు కానీ సాయంత్రం 6 కు ఆ కమాండో కూడా  బోర్డర్ పోస్ట్ వద్ద రిపోర్ట్ చేశాడు. మైన్ పేలుడు లో  అతని వేళ్ళు ముక్కలయ్యాయి.

ఈ కమాండోలు శత్రుదేశ భూబాగంలో 48 గంటలకు పైగా గడిపారు. కనీసం ఎనిమిది మంది పాక్ సైనికులను మట్టు పెట్టారు ఇంకో ఇద్దరు ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. వాళ్ళు తీసుకెళ్లిన ఇద్దరు సైనికుల తలలకు బదులుగా సుబేదార్ పర్వేజ్, హవల్దార్ అఫ్తాబ్, నాయక్ ఇమ్రాన్ ల తలలు తెచ్చారు. మూడు AK 47 లు మరికొన్ని ఆయుధాలను ట్రోఫీలుగా తెచ్చుకున్నారు.

దీని గురించి పాక్ ఎక్కడా చెప్పుకోలేదు. తేలు కుట్టిన దొంగలా మిన్నకుండి పోయింది. ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ లు భారత్ చేస్తూ ఉంటుంది కానీ వాటి వివరాలు బహిరంగ పరచకూడదు అని సైనిక అధికారులు నమ్ముతారు. ఈ ఆపరేషన్ జింజర్ గురించిన వివరాలు Hindu  పత్రిక సంపాదించి ప్రచురించింది. ఈ ఆపరేషన్ కు నేతృత్వం వహించిన రిటైర్డ్ మేజర్ జనరల్ S.K.చక్రవర్తి దీన్ని ధ్రువ పరిచారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!