A rare event …………………………………….
1997లో క్వీన్ ఎలిజబెత్ II మూడోసారి ఇండియాను సందర్శించారు. ఈ క్రమంలోనే రాణి హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘మరుదనాయగం’ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమల్ హాసన్ అంతకు ముందు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి రమ్మని ఎలిజబెత్ రాణి ని ఆహ్వానించారు.
1997 అక్టోబర్ 16 న రాణి MGR ఫిల్మ్ సిటీని సందర్శించారు. అక్కడ ఆమె కోసం సినిమాలోని ఒక యుద్ధ సన్నివేశాన్ని ప్రదర్శించారు.1.5 కోట్ల బడ్జెట్‌తో ఆ యుద్ధ సన్నివేశాన్నిచిత్రీకరించారట.రాణి సినిమా సెట్స్‌లో 20 నిమిషాలు గడిపారు. చిత్ర కథానాయకుడు కమల్ హాసన్ ‘మరుదనాయగం’ విశేషాలను ఆమెకు వివరించారు.
అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, కాంగ్రెస్ నాయకుడు మూపనార్, జర్నలిస్టు చో రామస్వామి, హీరో శివాజీ గణేశన్, బాలీవుడ్ నటుడు అమ్రిష్ పూరితో కలిసి రాణి ఎలిజబెత్ వేదికను పంచుకున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న 18వ శతాబ్దపు వీర యోధుడు ‘మరుదనాయగం’ నిజ జీవిత కథ ఆధారంగా కమల్ హాసన్ ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
తమిళ, ఫ్రెంచ్, ఆంగ్ల భాషల్లో విడుదల చేయాలని భావించారు. ఈ ప్రాజెక్టు కి ఒక బ్రిటన్ ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టాడు. బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన నాయకుని సినిమాకు బ్రిటన్ రాణి ఎలా హాజరవుతారంటూ విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు క్వీన్ ఎలిజబెత్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
ఈ లోగా బ్రిటిష్ ఇన్వెస్టర్ పై ఒత్తిళ్లు పెరగడంతో అతగాడు చేతులెత్తేశాడు. దీంతో సినిమా నిర్మాణం ఆగిపోయింది. 25 ఏళ్ళ నుంచి చిత్ర నిర్మాణం అలాగే పెండింగ్ పడిపోయింది. కమలహాసన్ కొన్ని ప్రయత్నాలు చేసినా అవేవి ఫలించలేదు. తీసినంతవరకు సినిమాను మంచి సాంకేతిక విలువలతోనే తీశారు. యూట్యూబ్ లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఆసక్తిగల ప్రేక్షకులు చూడవచ్చు.
pl. watch vedeo … ‘మరుదనాయగం’ song